E-Paper
Advertisement

మత్తులో మర్మయిడ్ ను పట్టుకొచ్చే అడిక్ట్… ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

మత్తులో మర్మయిడ్ ను పట్టుకొచ్చే అడిక్ట్… ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ ను డోంట్ మిస్
Advertisement

Fantasy Thriller : మనుషులు మత్తులో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అచ్చం అలాగే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో హీరో కూడా చేస్తాడు. కాకపోతే అతను మరింత ఎక్స్ట్రీమ్ కు వెళ్ళి ఓ జలకన్యను పట్టుకొస్తాడు. హాలీవుడ్ సినిమాల్లో జలకన్యలు సాధారణంగా అందమైన, ఆకర్షణీయమైన పాత్రలుగా కనిపిస్తాయి. కానీ ఈ మెర్మెయిడ్ మాత్రం అలాంటిది కాదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న మూవీ పేరు ‘మెర్మెయిడ్’ (Mermaid 2026 Movie). సాధారణ ఫాంటసీకి భిన్నంగా, డార్క్ కామెడీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో నిండిన ఒక భిన్నమైన చిత్రం. 2026లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కథలోకి వెళ్తే…

ఫ్లోరిడా తీర ప్రాంతంలో నివసించే డగ్ నెల్సన్ ఇందులో హీరో పాత్ర. ఈ యువకుడు ‘పెర్కోసెట్’ అనే డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసై, జీవితంలో అత్యంత దిగజారిన స్థితిలో ఉంటాడు. సముద్రం, సాహసాలు అంటే అతనికి ఎలాంటి ఆసక్తి లేదు. కానీ ఒకరోజు సముద్ర తీరంలో గాయపడి పడి ఉన్న ఒక జలకన్యను చూశాక అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఫాంటసీ సినిమాల్లో చూసినట్లు కాకుండా, ఈ జలకన్య కాస్త వికృతంగా, భయంకరంగా ఉంటుంది. డ్రగ్స్ మత్తులోనే ఉన్నప్పటికీ డగ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి కాపాడాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

ఈ క్రమంలోనే ఆమెతో అతనికి ఒక వన్-సైడెడ్ ఎమోషనల్ బంధం ఏర్పడుతుంది. కానీ ఆ జలకన్య డగ్ ఇంట్లో ఉందనే రహస్యం ఊరంతా తెలిసిపోవడానికి ఎక్కువ టైమ్ ఏమీ పట్టదు. ఇంకేముంది ఇక్కడే కథ ఊపందుకుంటుంది. స్వార్థపరులు, స్థానికులు, డ్రగ్ ముఠాలు… అందరూ ఆ జలకన్యను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. డగ్ తన జీవితంలో మొదటిసారిగా ఒకరి కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు. ఈ సినిమాలో జలకన్య రూపం, డగ్ డ్రగ్ అడిక్షన్, స్థానికుల స్వార్థం, హారర్ ఎలిమెంట్స్, డార్క్ కామెడీ ఆకట్టుకుంటాయి. సాధారణ ఫాంటసీ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం రియలిస్టిక్, డార్క్ టోన్‌తో సాగుతుంది.

మరి ఆ జలకన్యను హీరో ఎలా కాపాడాడు ? ఆమెతో ఏర్పడిన బాండింగ్ కారణంగా అతనిలో వచ్చిన మార్పు ఏంటి ? క్లైమాక్స్ లో కథ ఎలా ముగిసింది ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ‘మెర్మెయిడ్’ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం 2026 జూన్ 16న ఓటీటీలో విడుదలైంది. అమెరికాలో మాత్రం ఇదే ఏడాది మే 8న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్

Tags

Related News

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×