BigTV English
Advertisement

OTT Movie : పెళ్లి కావాల్సిన అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… రూపాలు మార్చుకుని మరీ ఆ పాడు పని

OTT Movie : పెళ్లి కావాల్సిన అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… రూపాలు మార్చుకుని మరీ ఆ పాడు పని

OTT Movie : ఇప్పుడు సినిమాలను థియేటర్లకు వెళ్ళకుండా, ఎక్కువగా ఓటీటీలోనే చూస్తున్నారు మూవీ లవర్స్. అన్ని జోనర్లలో వస్తున్న  సినిమాలు, ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. పెళ్ళి కవాల్సిన అమ్మయిలను ఈ సైకో టార్గెట్ చేస్తుంటాడు. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుటుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే 

జాన్ అలియాస్ అరవింద్ అనే సీరియల్ కిల్లర్ నేరాలను, అడ్డూ అదుపూ లేకుండా చేస్తుంటాడు. అతను ధనవంతులైన ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, వారి డబ్బును దోచుకుంటుంటాడు. పెళ్ళి కావాల్సిన అమ్మాయిలనే ఈ సైకో టార్గెట్ చేసి చంపుతుంటాడు. ఈ కిల్లర్ ఒక హత్య చేస్తున్న సమయంలో, అతని నేరాన్ని సుబద్ర అనే అమ్మాయి వీడియోలో రికార్డ్ చేస్తుంది. ఇక సుబద్ర అప్పట్నుంచి  అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటుంది. తన సోదరి లక్ష్మి ఎస్టేట్‌లోకి చొరబడి డబ్బు దోచుకోమని చెప్తుంది. ఆ తర్వాత లక్ష్మి, ఆమె కుటుంబాన్ని చంపమని ఒత్తిడి చేస్తుంది. అయితే లక్ష్మి ఆస్తిని చూసిన అరవింద్ కొత్త ప్లాన్ వేస్తాడు.


ఈ కథలో ఒక ఊహించని ట్విస్ట్ ఏమిటంటే, లక్ష్మి ఎస్టేట్ ఉన్న అడవిలో మనుషులను చంపుతూ ఒక పులి కూడా తిరుగుతూ ఉంటంది. అటవీ అధికారులు ఈ పులిని వేటాడుతుండగా, అరవింద్ ప్లాన్‌లో ఈ పులి అడ్డంకిగా మారుతుంది.లక్ష్మి, ఆమె చెల్లెలు సుబద్ర, ఆమె కూతురు ఒక ఇంట్లో పులికి అడ్డంగా దొరికిపోతారు. చివరికి ఆ పులి నుంచి వీళ్ళు తప్పించుకుంటారా ? కిల్లర్ లక్ష్మిని చంపడానికి ఎటువంటి ప్లాన్ వేస్తాడు. పెళ్ళి కాని అమ్మాయిలనే ఈ కిల్లర్ ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు ?  లక్ష్మీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి, కిల్లర్ వేసే కొత్త ప్లాన్ ఏంటి ? సుబద్ర తన సొంత అక్కని ఎందుకు చంపాలనుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

జీ 5 (Zee 5) లో

ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మిరుగా’ (Mirugaa). 2021 లో వచ్చిన ఈ మూవీకి J . పార్తిబన్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. జాగ్వార్ స్టూడియోస్ దీనిని నిర్మించింది. ఇది 2021 మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 (Zee 5) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయి… అబ్బాయిలకు ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ ఎక్స్పీరియన్స్

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×