BigTV English

Gundeninda GudiGantalu Today episode: కారు డైవర్లను చిక్కుల్లో పడేసిన బాలు.. ఫ్లాష్ బ్యాక్ లో వెళ్లిన సత్యం..

Gundeninda GudiGantalu Today episode: కారు డైవర్లను చిక్కుల్లో పడేసిన బాలు.. ఫ్లాష్ బ్యాక్ లో వెళ్లిన సత్యం..

Gundeninda GudiGantalu Today episode May 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తమ్ముడికి ఎలా అయిందని మీనా బాధపడుతూ ఉంటుంది. అయితే బాలు మాత్రం శివ చేయని ఎందుకు విరగొట్టాడు అందుకు కారణం ఏంటి అని అడిగితే చెప్పడు. ఎవరు ఎంత అడిగినా కూడా బాలు అసలు బయట పెట్టాడు. ఆఖరికి సత్యం కూడా నువ్వు ఇలా చేస్తావని అసలు ఊహించలేదంటూ అంటాడు. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాలు ఏదో కారణం వల్లే శివను కొట్టారని అనుకుంటారు. ముఖ్యంగా ప్రభావతి బాలు కారణం లేకుండా ఎవరిని కొట్టారు కదా ఏదో బలమైన కారణమే ఉంటుంది. కానీ వీడు ఏదో దాస్తున్నాడు. బాలు దాస్తున్న అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని ప్రభావతి ప్రయత్నిస్తుంది. బాలు మీనాకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కార్ డ్రైవర్లు అందరూ ఒకచోట ఉంటారు. అయితే అప్పుడే గుణ అక్కడికి వస్తాడు.. అక్కడ ఉన్న కార్ డ్రైవర్లు అందరూ కూడా నీకు వడ్డీ కట్టం కదా మళ్లీ ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతారు.. వడ్డీ కట్టారు సరే నన్ను మీవాడు కొట్టాడు కదా అందుకే నేను చాలా హర్ట్ అయ్యాను మీలాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయానని అంటారు. ఏదైనా కష్టం వస్తే మీ బాలు కచ్చితంగా వస్తాడు కదా వాడిని అడిగి ఏదైనా చేసుకోండి అని అంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు గుణ అని రాజేష్ అడుగుతాడు. వడ్డీ ఇచ్చారు సరే నేను అంత మంచివారిని కాదు అసలు కూడా నాకు రెండు రోజులు ఇవ్వాలి లేదంటే మీకు కార్లన్నీ తీసుకుపోతానని గుణ అంటాడు.

అదేంటి కార్ల నేస్తే మేము ఎలా బతుకుతాం నీకు డబ్బులు ఇవ్వాల్సినవి ఇస్తున్నాం కదా మళ్లీ కార్లు ఇవ్వమంటే మా ఇంటిని ఎలా పోషించికోవాలి అని అంటారు. ఏది ఏమైనా కూడా బాలు చేసిన దానికి ఆ గుణ గాడే రెచ్చిపోతున్నాడు అని అనుకుంటారు.. ఇక రవి, శృతి మాట్లాడుకుంటారు. ఈరోజు ఏమి రోజు కనీసం గుర్తుందా ఈమధ్య నీకు నామీద ప్రేమ తగ్గిపోయింది అని శృతి అంటుంది. అదేంటి అలా అడిగావు కొత్తగా ఈ క్వశ్చన్ ఏంటి అని శ్రుతిని రవి అడుగుతాడు. మనము ఫస్ట్ కలిసిన రోజు అంటే గుర్తుందా? ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న రోజు గుర్తుందా? ఏది గుర్తుకులేదు అందుకే నీకు ఈమధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటూ శృతి రవిని అడుగుతుంది.


రవి ఎందుకు శృతి అలా మాట్లాడతావు ఏదో ఒక రోజు డేట్ మర్చిపోతే దాని గురించి ఇలా మాట్లాడతావా నీ మీద ప్రేమ తగ్గిపోయిందా? రెస్టారెంట్లో బిజీగా ఉండడంవల్ల అన్ని గుర్తుపెట్టుకో లేకపోయాను. అంతేకానీ నిన్ను బాగా చూసుకోవట్లేదా అని రవి అంటాడు. దానికి శృతి నిజంగానే నీకు నేనంటే ఇష్టం తగ్గిపోయింది. నేను బోర్ కొట్టేసాను నీకు అని రవిని అంటుంది. నీ ఇష్టం వచ్చింది నువ్వు అనుకుంటున్నావు కదా ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అని అనగానే రవి పద నీకు ఒకటి చెప్తాను అని కిందకు తీసుకొని వెళుతుంది.

కింద సత్యం ఉంటాడు. అంకుల్ నేను మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని శ్రుతి అంటుంది. ఏంటమ్మా చెప్పు అని సత్యం అంటాడు. అంకుల్ మీరు ఆంటీ ని మొదటిసారి ఎప్పుడు చూశారు అని అడుగుతుంది. మీకు కనీసం ఆ డేట్ గుర్తుందా అని అంటే అసాధ్యం మొదటిసారి ప్రభావతిని చూసిన డేట్ని చెప్తాడు. మొదటిసారి ఏ కలర్ చీరలో కనిపించింది అన్న విషయాన్ని కూడా చెప్పడంతో రవి షాక్ అవుతాడు. ఇక ప్రభావతి కూడా షాక్ అవుతుంది. ఇన్నేళ్లయిన కూడా అంకుల్ అంటే మర్చిపోలేదు చూశారా.. అంకుల్ కి ఆంటీ అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి ఇంత షార్ప్ గా ప్రతిదీ గుర్తుపెట్టుకున్నారని శృతి సత్యంని పొగిడేస్తుంది..

తర్వాత రోహిణి దగ్గరికి వెళ్లి మనోజ్ ని మొదటి సారి చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్ లో ఉన్నాడు? ఎప్పుడు మీరిద్దరూ కలుసుకున్నారు అని అడుగుతుంది. దానికి రోహిణి సమాధానం చెప్తుంది. అలాగే మనోజ్ దగ్గరకు వెళ్లి రోహిణి మొదటిసారి చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్ లో ఉందో గుర్తుందా అని అడుగుతుంది. మనోజ్ కూడా సమాధానం చెప్పడంతో రవి నీ శృతి మళ్లీ రూమ్ కి తీసుకెళ్తుంది.. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా అది నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా అని అడుగుతుంది.. నాకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది ఈరోజు తొందరగా రెస్టారెంట్ నుంచి వచ్చి నేను బయటకు తీసుకెళ్తాను అని అంటాడు దాంతో శృతి ఫుల్ ఖుషి అవుతుంది.

బాలు కార్ల స్టాండ్ కి వెళ్తాడు. బాలు రాగానే నీవల్ల మేమందరం రోడ్డు పాలు అయ్యాము అని అందరూ అంటారు. పనికి రాజేష్ మనమందరం కష్టాల్లో ఉన్నప్పుడు వాడు అండగా నిలబడినప్పుడు ఈ మాటలు రావేంటి అని అంటాడు. అయితే ఏమైంది అని బాలు అడుగుతాడు. అ గుణ వచ్చి వడ్డీ డబ్బులు కాదు అసలు మొత్తం కట్టాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు.. లేదంటే మాత్రం రెండు రోజుల్లో కార్లు తీసుకెళ్లి పోతానని అన్నాడని బాలుకి చెప్తారు.. మీ కార్లు ఎక్కడికి వెళ్లావు నేను ఇప్పుడే వస్తానని బాలు గుణ దగ్గరికి వెళ్తాడు. అక్కడ గుణతో గొడవ పడతాడు. తప్పైపోయింది క్షమించు అని నా కళ్ళు అలాగే శివ కాలు పట్టుకో అప్పుడు వదిలేస్తానని బాలుకు వార్నింగ్ ఇస్తాడు గుణ. నేనేం చేయాలో నాకు తెలుసు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?

GudiGantalu Today episode: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: వేదవతికి కొత్త టెన్షన్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..ఇంట్లో బాంబ్ పేల్చిన కళ్యాణ్..

Big Stories

×