OTT Movie : రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని సినిమాలు, సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్, పొలిటికల్, క్రైమ్ స్టోరీలతో వచ్చిన ఈ సినిమాలు మంచి విజయాలను కూడా సాధించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. త్రిస్సూర్‌లో జరిగిన ఒక భారీ ఆర్థిక కుంభకోణం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఒక మర్డర్ కేసుతో మొదలయ్యే ఈ కథ థ్రిల్లర్ అభమానులను ఆకట్టుకుంటోంది. అయితే 11 రోజుల్లోనే ఈ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
త్రిస్సూర్‌లో సామ్యూల్ ఊమ్మన్ అనే సంపన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. అయితే అక్కడ అతని నెక్లెస్ కనిపించకుండా పోతుంది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ ఈ కేసును తీసుకుంటాడు. ఇది ప్రమాదం కాదని, హత్య అని అనుమానిస్తాడు. అతని దర్యాప్తు సామ్యూల్ దగ్గర పనిచేసే ఫ్రాన్సిస్‌పై మల్లుతుంది. కానీ త్వరలోనే ఇది త్రిస్సూర్‌లోని ఒక కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగిన పెద్ద ఆర్థిక కుంభకోణంతో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఆంటోనియో షాజీ అనే ఆటో డ్రైవర్‌ను, ఇతర అనుమానితులను విచారిస్తూ, ఈ భారీ కుట్రను బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. మొదటి మూడు ఎపిసోడ్‌లు, అనూహ్య ట్విస్ట్‌లతో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తాయి.
ఈ కేఊ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, సామ్యూల్ మరణం వెనుక అసలు రహస్యం, బ్యాంక్ కుంభకోణంలో పాల్గొన్న పెద్ద తలకాయలు బయటపడతారు. ఆంటోనియో తన విచారణలో ఫ్రాన్సిస్, షాజీ ఇతర స్థానిక వ్యక్తుల గతాన్ని తవ్వుతాడు. చివరి వరకు ఈ స్టోరీ ఊహించని ట్విస్టులతో ముందుకు సాగుతుంది. క్లైమాక్స్‌లో ఆంటోనియో ఈ కుట్రను ఛేదిస్తాడా ? సామ్యూల్ ఎలా చనిపోయాడు ? ఆ నెక్లెస్ ఎవరు దొంగలించారు ? బ్యాంక్ కుంభకోణంతో సామ్యూల్ హత్యకు లింక్ ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాల్సిందే.
‘కమ్మట్టం’ (Kammattam) 2025లో విడుదలైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. షాన్ తులసీధరన్ దర్శకత్వంలో, సుదీవ్ నాయర్, జియో బేబీ, వివియా సాంత్, అజయ్ వాసుదేవ్, జిన్స్ భాస్కర్, అఖిల్ కావలయూర్, శ్రీరేఖ, అరుణ్ సోల్, జోర్డీ పూంజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ZEE5లో 2025 సెప్టెంబర్ 5న ఒనం పండుగ సందర్భంగా ప్రీమియర్ అయింది. 115 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ మలయాళం ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు, తమిళ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
Read Also : 20 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… సంయుక్త మీనన్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసుండరు భయ్యా