BigTV English

Iran Israel War : అణుబాంబు టెన్షన్.. ఇరాన్‌పై అమెరికా అటాక్?

Iran Israel War : అణుబాంబు టెన్షన్.. ఇరాన్‌పై అమెరికా అటాక్?

Iran Israel War : ఇరాన్ మరో ఇరాక్ కాబోతోందా? ఇరాన్ రాజధాని శ్మశానంగా మారనుందా? ఇరాన్‌పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి చేయబోతోందా? ఇరాన్‌లో ఏదో జరగబోతోందా? టెహ్రాన్‌ గగనతలాన్ని పూర్తిగా కంట్రోల్‌‌లోకి తీసుకున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన వేళ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులు వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.


ఇరాన్ కొత్త ఆర్మీ చీఫ్ కూడా..

ఇరాన్ కొత్త ఆర్మీ చీఫ్ అలీ షాద్‌మానీని కూడా ఇజ్రాయెల్ లేపేసింది. అలి మూమెంట్స్‌పై పక్క సమాచారం అందుకున్న ఇజ్రాయెల్.. సెంట్రల్ టెహ్రాన్‌లో ఉండగా టార్గెట్ చేసి చంపేసింది. అటు.. కెనడా, జీ7 సమ్మిట్ నుంచి వాషింగ్టన్‌కు అర్జెంట్‌గా తిరిగి వచ్చేశారు ట్రంప్. హడావుడిగా సిట్యుయేషన్‌ రూమ్‌ను రెడీ చేయించారు. మరోవైపు, ఇజ్రాయెల్‌‌కు మద్దతు ప్రకటిస్తూ జీ7 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని తీర్మానించాయి. జీ7 సపోర్ట్‌తో అమెరికా ఏ క్షణంలోనైనా ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై అటాక్ చేసేలా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అమెరికా డైరెక్ట్‌గా యుద్ధంలోకి దిగితే పరిణామాలు మరింత తీవ్రంగా మారిపోవడం ఖాయం.


ఆ బాంబు అమెరికా దగ్గర మాత్రమే..

ఇటీవల ఇజ్రాయెల్ చేసిన అటాక్‌లో ఇరాన్‌లోని అణుకేంద్రాలు దెబ్బతిన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ, ఏమంత పెద్ద డ్యామేజ్ కాదని.. అణుకేంద్రాలు ఇంకా సేఫ్‌గానే ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇరాన్‌లోని నంతాజ్, ఫార్దో అణు సెంటర్లను ఓ పర్వతం లోపల భూగర్భంలో చాలా లోతులో నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే ఇజ్రాయెల్ దగ్గరున్న బాంబులతో పని అవదు. కొండలను సైతం పిండి చేసే బాంబు కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఆ బాంబు పేరు.. GBU 57 బంకర్ బస్టర్.

అటాక్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?

బంకర్ బస్టర్ బాంబు ఏకంగా 20 అడుగుల పొడువు, 13,600 కిలోల బరువు ఉంటుంది. ఆ బాంబును తరలించడం కూడా అంత ఆషామాషీ కాదు. అమెరికా దగ్గర ఉన్న B-2 స్పిరిట్ బాంబర్ ఫైటర్‌జెట్లు మాత్రమే ఆ బాంబును ప్రయోగించగలవు. ఆ అటాక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అధ్యక్షుడు ట్రంప్ రెడీ అవుతున్నారని సమాచారం.

Also Read : వరల్డ్ వార్ 3 షురూ.. ఇరాన్‌కు ఆఖరి రాత్రి..

ఇరాన్ F 14లు ధ్వంసం

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. టెహ్రాన్‌ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్‌అవీవ్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎయిర్ పోర్టులోని F 14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఈ యుద్ధ విమానాలను 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్‌కు ముందు అమెరికా వీటిని ఇరాన్‌కు ఇవ్వడం ఆసక్తికరం. ఇరాన్ ఇప్పటికీ ఆ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది.

ఇండియన్ ఎంబసీ అలర్ట్

మరోవైపు, భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ భారతీయ ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. నగరం లోపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది. మరోవైపు, టెహ్రాన్ మరియు ఢిల్లీలో.. 24 బై 7 పని చేసే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది.

ఢిల్లీ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్స్ :

1800118797 (Toll-free)
+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905
+91-9968291988 (WhatsApp)
situationroom@mea.gov.in

టెహ్రాన్‌లో ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నెంబర్స్ :

+98 9128109115
+98 9128109109

WhatsApp: +98 901044557, +98 9015993320, +91 8086871709.

⁠Bandar Abbas: +98 9177699036
⁠Zahedan: +98 9396356649

cons.tehran@mea.gov.in.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×