BigTV English

OTT Movie : అక్కడికి వెళ్తే ప్రాణాలు పోయినట్టే … ఒకే డి‌ఎన్‌ఏ తో వందల మంది … ఫ్యూజులు అవుటయ్యే స్టోరీ బ్రో

OTT Movie : అక్కడికి వెళ్తే ప్రాణాలు పోయినట్టే … ఒకే డి‌ఎన్‌ఏ తో వందల మంది … ఫ్యూజులు అవుటయ్యే స్టోరీ బ్రో

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చంద్రుని మీద జరుగుతుంది. అందులో ఒక లోహం గురించి మైనింగ్ జరుగుతుంది. అక్కడ మూడు సంవత్సరాలకి ఒక సారి కొత్త వ్యక్తి వస్తాడు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని వివరాలు తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు’మూన్’ (Moon). 2009 లో వచ్చిన దీనికి డంకన్ జోన్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సామ్ బెల్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను చంద్రునికి అవతలి వైపున మూడు సంవత్సరాలు ఒంటరిగా, మైనింగ్ కోసం పని చేస్తుంటాడు. ముగింపు సమయంలో అసలు ట్విస్ట్ ఎదుర్కుంటాడు. ఇందులో కెవిన్ స్పేసీ, డొమినిక్ మెక్‌ఎల్లిగాట్, కయా స్కోడెలారియో, బెనెడిక్ట్ వాంగ్, మాట్ బెర్రీ వంటి నటులు నటించారు. మూన్ 2009 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 12 జూన్ 2009న న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌లో విడుదలైంది. ఈ మూవీ అనేక చలన చిత్రోత్సవ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ బ్రిటిష్ చిత్రంగా BAFTA అవార్డుకు నామినేట్ చేయబడింది. 2010లో ఉత్తమ నాటకీయ ప్రదర్శనగా హ్యూగో అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సామ్ బెల్ అనే వ్యోమగామి చంద్రుడిపై మూడు సంవత్సరాల కాంట్రాక్ట్‌లో, హీలియం-3 అనే శక్తి వనరును తవ్వే పనిలో ఉంటాడు. ఈ హీలియం-3 భూమి శక్తి వంతమైన లోహం. సామ్ ఒంటరిగా ఆ స్టేషన్‌లో పని చేస్తాడు, అతనికి అక్కడ సహాయకుడి గా గెర్టీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ మాత్రమే తోడుగా ఉంటుంది. సామ్ తన మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ ముగియడానికి రెండు వారాల ముందు, ఒంటరితనం వల్ల మానసికంగా కృంగిపోతాడు. అతను భూమితో నేరుగా సంప్రదించలేక పోతాడు. అయితే తన భార్య టెస్ నుండి సందేశాలను అందుతుంటాయి. ఒక రోజు స్పేస్ స్టేషన్‌లో, అతను ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత అతను తన గురించి ఒక షాకింగ్ నిజాన్ని కనుగొంటాడు. అతను ఒక క్లోన్ అని, లూనార్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ సామ్ బెల్ క్లోన్‌లను ఉపయోగించి, ప్రతి మూడు సంవత్సరాలకు ఒక కొత్త క్లోన్‌ను స్టేషన్‌లో పని చేయడానికి పంపిస్తుందని తెలుసుకుంటాడు.

సామ్ ఇదంతా తెలుసుకుని, తన తర్వాతి క్లోన్ తో కలుస్తాడు. వారిద్దరూ కలిసి కంపెనీ నీచమైన ప్రణాళికలను గుర్తిస్తారు. క్లోన్‌ల జీవితకాలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వారు అనారోగ్యంతో చనిపోతారు. లేదా ‘హైబర్నేషన్’ పేరుతో నాశనం చేయబడతారు. సామ్1, ఇప్పటికే బలహీనంగా ఉన్నాడు, సామ్2ని భూమి వైపుకి తప్పించుకునేలా సహాయం చేస్తాడు. అక్కడ అతను కంపెనీ అనైతిక చర్యలను బయట పెట్టాలని ప్లాన్ చేస్తాడు. సామ్1 తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. సామ్2 హీలియం-3 ట్రాన్స్‌పోర్ట్‌లో దాక్కుని భూమికి చేరుకుంటాడు. చివరికి సామ్2 ఆ కంపెనీ మోసాలను బయట పెడతాడా ? అతను ఎంతకాలం బతుకుతాడు ? ఈ విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also : కోరి గెలికినందుకు దయ్యంతో దబిడి దిబిడి… మస్ట్ వాచ్ మలయాళం హారర్ థ్రిల్లర్

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×