E-Paper
Advertisement

Up Coming Movies : ఏప్రిల్ నెలలో ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ మూవీస్… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే

Up Coming Movies : ఏప్రిల్ నెలలో ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ మూవీస్… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే
Advertisement

Up Coming Movies : సినిమా ప్రియులకు థియేటర్లలో ఎంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో, ఇప్పుడు ఓటీటీలు అంతకంటే ఎక్కువ వినోదాన్ని పంచుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు, సిరీస్‌లు చూసే అలవాటు అందరికీ పెరిగిపోయింది. ఇక 2026 ఏప్రిల్ నెలకు గాను ఓటీటీలో చాలా ప్రత్యేకమైన కంటెంట్ ఉన్న స్టోరీలు రాబోతున్నాయి. పెద్ద స్టార్ల సినిమాలు, ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్లు, నవ్వులు పూయించే కామెడీ సిరీస్‌లతో ఈ నెల ప్యాక్ అయిపోయింది. మరి ఈ నెలలో ఏ ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒక లుక్కేద్దాం.

1. తు యా మైన్ (Tu Yaa Main)

ఆదర్శ్ గౌరవ్, శనాయా కపూర్ జంటగా నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక అడవిలో మొసలి బారిన పడి, ప్రాణాల కోసం ఎలా పోరాడారనేదే ఈ సినిమా కథ. బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది.

2. అస్సీ (Assi)

Advertisement

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా ‘అస్సీ’. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, న్యాయం కోసం ఒక మహిళ చేసే పోరాటాన్ని దర్శకుడు అనుభవ్ సిన్హా ఇందులో గట్టిగానే చూపించారు. కణి కుసృతి, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 17 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమ్ కానుంది.

3. వధ్ 2 (Vadh 2)

మొదటి పార్ట్ ‘వధ్’ ఒక సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఒక మధ్యతరగతి తండ్రి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్లాడనే పాయింట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘వధ్ 2’ వస్తోంది. సంజయ్ మిశ్రా తన నటనతో మరోసారి థ్రిల్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏప్రిల్ 3 నుండి Netflixలో స్ట్రీమింగ్ కానుంది.

4. మామ్లా లీగల్ హై సీజన్ 2 (Maamla Legal Hai Season 2)

Advertisement

కోర్టు రూమ్ డ్రామా అంటే సీరియస్‌గానే ఉండక్కర్లేదు, నవ్వుతూ కూడా చూడొచ్చు అని నిరూపించిన సిరీస్ ఇది. రవి కిషన్ లాయర్‌గా చేసిన హంగామా ఫస్ట్ సీజన్‌లో చూశాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సీజన్ 2 ఏప్రిల్ 3న Netflixలో రాబోతోంది. లీగల్ పాయింట్స్‌ను కామెడీతో కలిపి చూడాలనుకునే వారు దీన్ని అస్సలు మిస్ అవ్వకూడదు.

5. భాబీజీ ఘర్ పర్ హై! ఫన్ ఆన్ ద రన్ (Bhabiji Ghar Par Hain! Fun on the Run)

బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన ‘భాబీజీ ఘర్ పర్ హై’ ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో అలరించబోతోంది. ‘ఫన్ ఆన్ ద రన్’ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 3 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది. సింపుల్ హ్యూమర్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Read Also :  లవర్ ను బాస్ తో గడపమనే ప్రియుడు… ఊహించని షాక్ ఇచ్చే ప్రియురాలు… కళ్లు చెదిరే క్లైమాక్స్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×