BigTV English

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

OTT Movie : కొరియన్ డ్రామాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ డ్రామాలు టెన్షన్ పెట్టే సీన్లు, ఊహించని ట్విస్ట్‌లతో అందరినీ ఆకర్షిస్తాయి. మీకు గూస్‌బంప్స్ ఇచ్చే కథ, మనసును కదిలించే ఎమోషన్స్ ఉన్న స్టోరీ కావాలంటే మీ కోసమే ఈ సిరీస్. మరి ఇంత ఆసక్తికరమైన కథను ఎక్కడ చూడొచ్చో తెలుసుకోవాలనుందా? రండి, ఈ థ్రిల్లింగ్ జర్నీలోకి వెళ్దాం!


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్రేజీ కొరియన్ సిరీస్ పేరు ‘Mouse’. 20 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ కు చోయ్ జూన్-బే దర్శకత్వం వహించగా, iQIYI స్టూడియో నిర్మాణంలో రూపొందింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉంది. లీ సియుంగ్-గి (జంగ్ బా-రియమ్), లీ హీ-జూన్ (గో మూ-చి), పార్క్ జూ-హ్యున్ (ఓహ్ బాంగ్-యీ), క్యుంగ్ సూ-జిన్ (చోయ్ హాంగ్-జూ), అన్ జే-వూక్ (హాన్ సియో-జూన్), కిమ్ జంగ్-నాన్ (సంగ్ యో-హాన్) ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ 57వ బేక్సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్‌లో లీ సియుంగ్-గికి బెస్ట్ యాక్టర్ నామినేషన్ తెచ్చిపెట్టింది. ఇందులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, నటీనటుల అద్భుతమైన నటన, షాకింగ్ ట్విస్ట్‌లు 2021లో టాప్ కొరియన్ డ్రామాలలో ఒకటిగా ఈ సిరీస్ నిలిచేలా చేశాయి.


స్టోరీలోకి వెళ్తే

కథ జంగ్ బా-రియమ్ (లీ సియుంగ్-గి) అనే ఒక నిజాయితీ గల యంగ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను తన పరిసరాల్లో జరిగే సీరియల్ మర్డర్స్ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కేసులో ‘హెడ్ హంటర్’ అనే క్రూరమైన సీరియల్ కిల్లర్ ఉంటాడు, అతని గతం ఒక భయంకరమైన రహస్యంతో ముడిపడి ఉంటుంది. బా-రియమ్ తన బాల్య స్నేహితుడు, డిటెక్టివ్ గో మూ-చి (లీ హీ-జూన్)తో కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. గో మూ-చి గతంలో తన కుటుంబాన్ని సీరియల్ కిల్లర్ చంపడం వల్ల బాధతో, పగతో ఉంటాడు.

Read Also : ఈ ఊర్లో ఒంటరితనం నేరం… సింగిల్స్ ను శిక్షించే వింత హోటల్… మొత్తం ఆ సీన్లే

కథలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, సైకోపాత్‌లను గుర్తించే ఒక జన్యు పరీక్ష. ఇది ఒక వ్యక్తి జన్మతః హంతకుడిగా ఉంటాడా లేదా అనే విషయాన్ని ముందుగానే చెబుతుంది. ఈ పరీక్ష ఫలితాలు బా-రియమ్, మూ-చి, ఇతర పాత్రల జీవితాలను తలకిందులు చేస్తాయి. కథలో చోయ్ హాంగ్-జూ (క్యుంగ్ సూ-జిన్) అనే టీవీ ప్రొడ్యూసర్, ఓహ్ బాంగ్-యీ (పార్క్ జూ-హ్యున్) అనే డేరింగ్ అమ్మాయి కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. ఈ కేసు వెనుక ఒక శక్తివంతమైన సంస్థ, బా-రియమ్ గతం, సీరియల్ కిల్లర్ హాన్ సియో-జూన్ (అన్ జే-వూక్) షాకింగ్ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. మరి ఆ సీక్రెట్స్ ఏంటి? వరుసగా మర్డర్స్ చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చివరికి ఆ కిల్లర్ ను పట్టుకోగలిగారా? అన్నది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

Big Stories

×