Friday OTT Releases : ప్రతినెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే ప్రతివారం ఓటిటిలోకి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. సిటీలోకి సినిమాలన్నీ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అలాగే ఇవాళ శుక్రవారం నాడు కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేసాయి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ ప్రేక్షకులకు కొత్త కంటెంట్ సినిమాలను అందించాలని థియేటర్లలో విడుదలైన కొత్త కంటెంట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుకు సినిమాలను భారీ ధరలు చెల్లించి బుక్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలు JioHotstar , Netflix మరియు Amazon Prime Video వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి .. ఇక ఆలస్యం చెయ్యకుండా ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం..
Also Read: అరెస్ట్ భయం..కోర్టు మెట్లేక్కిన శ్యామల.. నేడే విచారణ..
ఈ వారం OTT విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..
నెట్ ఫ్లిక్స్..
రిట్నర్ ఆఫ్ ద డ్రాగన్ – తెలుగు సినిమా
లిటిల్ సైబీరియా – ఫినిస్ మూవీ
రివిలేషన్స్ – కొరియన్ సినిమా
ఆఫీసర్ ఆన్ డ్యూటీ – తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్ – హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
అమెజాన్ ప్రైమ్..
నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్ – తమిళ సినిమా
స్కై ఫోర్స్ – హిందీ మూవీ
హాట్ స్టార్..
కన్నెడ – హిందీ సిరీస్
ఆహా..
బ్రహ్మానందం – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
రింగ్ రింగ్ – తమిళ మూవీ
సన్ నెక్స్ట్..
బేబీ అండ్ బేబీ – తమిళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ..
బార్బరిక్ – ఇంగ్లీష్ సిరీస్
ఆఫీసర్ ఆన్ డ్యూటీ..
ఇదొక మలయాళ మూవీ. కుంచాకో బోబన్ ఈ గ్రిటీ థ్రిల్లర్ చిత్రంతో కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జితు అష్రఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ అధికారి హరిశంకర్ వివిధ సమస్యలతో పోరాడుతున్నప్పటికీ, హరిశంకర్ నకిలీ బంగారు గొలుసు కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ మూవీలో కేసును ఎలా చోధించారు అనే దానిపై స్టోరీ లైన్ ఉంటుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
డ్రాగన్ మూవీ..
ప్రముఖ తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ డ్రాగన్.. కాలేజీ డ్రాపౌట్ అయిన డి.రాఘవన్ గా తిరిగి వస్తున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి అతను నకిలీ పత్రాలు తయారు చేస్తాడు కానీ ఇప్పుడు పట్టుబడకుండా ఉండటానికి తన బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. ఈ బ్లాక్ బస్టర్ తమిళ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కూడా నటిస్తున్నారు.. ఈ మూవీ కూడా ప్రముఖ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
జితేంద్ర రెడ్డి ..
తెలంగాణలోని ముఖ్యమైన నాయకుడు జితేంద్ర రెడ్డి జీవిత ఆధారంగా తెరికెక్కిన మూవీనె ఇది.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించలేకపోయింది. పరాజయం పాలైంది. OTT విడుదలైన తర్వాత జితేందర్ రెడ్డి ఏదైనా ప్రశంసలను పొందుతాడో లేదో చూడాలి.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలే ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి ఇక శని ఆదివారాల్లో మరికొన్ని సినిమాల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది..