E-Paper
Advertisement

ప్రతి సెకను ఉత్కంఠ రేపుతున్న మర్డర్ మిస్టరీ… డిటెక్టివ్ గా టైటానిక్ హీరోయిన్… ఐయండిబిలో 8.4 రేటింగ్

ప్రతి సెకను ఉత్కంఠ రేపుతున్న మర్డర్ మిస్టరీ… డిటెక్టివ్ గా టైటానిక్ హీరోయిన్… ఐయండిబిలో  8.4 రేటింగ్
Advertisement

Mystery thriller series : టైటానిక్ హీరోయిన్ నటించిన ఒక క్రైమ్ మిస్టరీ సిరీస్ ప్రశంసలు అందుకుని, ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఇది ఇయండిబిలో 8.4 టాప్ రేటింగ్ తో నడుస్తోందంటే కథ ఏమేరకు ఆకట్టుకుంటుందో తెలుస్తోంది. ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం కేట్ విన్స్‌లెట్. ఈ పాత్ర ఆమె కోసం ఎంత కష్టపడిందంటే, తన ముఖంపై ముడతలు కనిపించినా పర్వాలేదు కానీ మేకప్ మాత్రం వేయనని మొండికేసింది. ఆఖరికి పోస్టర్లలో కూడా తన ఫోటోను ఎడిట్ చేయనివ్వలేదు. పెన్సిల్వేనియాలోని ఆ పల్లెటూరి యాస పలకడానికి ఆమె చాలా నెలలు ప్రాక్టీస్ చేసింది. ఈ సిరీస్ షూటింగ్ కరోనా టైమ్‌లో ఆగిపోయినా, మళ్ళీ మొదలుపెట్టి చాలా పకడ్బందీగా పూర్తి చేశారు. కష్టానికి ఫలితంగా ఈ సిరీస్ అయితే సూపర్ హిట్ అయిపోయింది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్’ (Mare of Easttown) 2021లో వచ్చిన ఈ సిరీస్ లో కేట్ విన్స్‌లెట్, జూలియన్నే నికల్సన్, జీన్ స్మార్ట్, ఇవాన్ పీటర్స్ లీడ్ రోల్స్ లో నటించారు. 7 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ jio hotstar లో అందుబాటులో ఉంది. ఇది 2021లో అవార్డుల విషయంలో కూడా ఒక ఊపు ఊపేసింది. మొత్తం 16 ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యి, అందులో నాలుగింటిని సొంతం చేసుకుంది. కేట్ విన్స్‌లెట్‌తో పాటు, ఇందులో నటించిన ఇవాన్ పీటర్స్, జూలియన్నే నికల్సన్ కూడా అవార్డులు గెలుచుకున్నారు. విమర్శకులు దీనిని దశాబ్దపు ఉత్తమ క్రైమ్ డ్రామా అని మెచ్చుకున్నారు. కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా ఈ సిరీస్ చాలా గొప్పగా చూపిస్తుంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఈ కథ అంతా ఈస్ట్‌టౌన్ అనే ఒక చిన్న ఊరి చుట్టూ తిరుగుతుంది. అక్కడ మేర్ అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమెకి జీవితంలో అన్నీ కష్టాలే. కొడుకు చనిపోయి ఉంటాడు, మొగుడు విడాకులు ఇచ్చేసి పక్క ఇంట్లోనే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ఆ ఊరిలో ఒక అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతుంది. అసలే పాత కేసు ఒకటి తేల్చలేదని ఊరి జనం మేర్‌ను తిట్టుకుంటుంటారు, ఇప్పుడు ఈ కొత్త కేసు ఆమె నెత్తిన పడుతుంది. ఇక మేర్ రంగంలోకి దిగి ఆ హత్య ఎవరు చేశారో కనిపెట్టే పనిలో పడుతుంది. ఆ ఊరు చిన్నది కావడంతో అందరూ చుట్టాలే, అందరూ తెలిసినోళ్లే. కానీ ఎంక్వైరీ చేస్తుంటే ఆ హత్య చేసింది ఎవరో తెలిస్తే మేర్ తో పాటు మనకు కూడా దిమ్మతిరిగిపోతుంది. ఎందుకంటే ఆ హంతకుడు ఆమెకు చాలా దగ్గరైన వాడే అయ్యుంటాడు. ఈ సిరీస్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, ఒక మనిషి తన బాధను, ఒత్తిడిని తట్టుకుంటూ ఎలా నిలబడింది అనేది కూడా మెయిన్ పాయింట్. మేర్ పాత్రలో కేట్ విన్స్‌లెట్ మామూలుగా నటించలేదు, అచ్చం మన పక్కింటి మనిషిలాగే కనిపిస్తుంది. ఆ ఊరి వాతావరణం, ఆ గొడవలు, ఆ సస్పెన్స్ అన్నీ కలిపి మనల్ని సీటు అంచున కూర్చోబెడతాయి.

Read Also : పగలు వైద్యులుగా, రాత్రికి దెయ్యాలతో … మాయలు మంత్రాలతో మతి పోగొడుతున్న సిరీస్

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×