E-Paper
Advertisement

పగలు వైద్యులుగా, రాత్రికి దెయ్యాలతో … మాయలు మంత్రాలతో మతి పోగొడుతున్న సిరీస్

పగలు వైద్యులుగా, రాత్రికి దెయ్యాలతో … మాయలు మంత్రాలతో మతి పోగొడుతున్న సిరీస్
Advertisement

Horror Thriller Series : ఓటీటీలో ఒక హారర్ సిరీస్ చాలా భయపెడుతోంది. ఇది పోలిష్ పురాణాలు, జానపద కథల ఆధారంగా రూపొందింది. మన దగ్గర కాళికా దేవి, వింత రాక్షసుల కథలు ఉన్నట్టే, ఐరోపాలోని స్లావిక్ పురాణాల మీద దీనిని తీశారు. ఇందులో చూపించే రాక్షసులు, మంత్రగత్తెలు అన్నీ ఆ దేశపు పాత కథల నుండి తీసుకున్నవే. అందుకే వేరే హర్రర్ సినిమాల కంటే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ సిరీస్ లోని విజువల్ ఎఫెక్ట్స్ విమర్శకుల ప్రశంసలు పొందాయి. మాయలు, మంత్రాలతో హోరెత్తిపోతుంది ఈ సిరీస్. ఇది హర్రర్, ఫాంటసీ, మిస్టరీ జోనర్లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ పోలిష్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘క్రాకో మాన్‌స్టర్స్’ (Cracow Monsters). కాసియా అదామిక్, ఓల్గా చజ్దాస్ అనే ఇద్దరు మహిళా దర్శకులు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో బార్బరా లిబెరెక్ (అలెక్స్), ఆండ్రెజ్ కైరా (ప్రొఫెసర్ జవాడ్జ్‌కి) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2022 మార్చి 18న నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అలెక్స్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ కి చిన్నప్పటి నుంచి ఏదో తెలియని భయం, వింత వింత కలలు వస్తుంటాయి. ఆమె ఒక కాలేజీలో జాయిన్ అయినప్పుడు, అక్కడ ఒక వింత ప్రొఫెసర్ పరిచయం అవుతాడు. ఆయన బయటకి పాఠాలు చెప్పే ప్రొఫెసర్ లా కనిపిస్తాడు కానీ, లోపల మాత్రం తన స్టూడెంట్స్ తో కలిసి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఈ గ్యాంగ్ పని ఏంటంటే.. రాత్రిపూట ఊరి మీద పడే దెయ్యాలు, రాక్షసుల పని పట్టడం. అలెక్స్ ఆ గ్యాంగ్‌లో చేరాక అసలు విషయం బయటపడుతుంది. ఆ నగరంలో పాత కాలపు రాక్షసులు మళ్ళీ నిద్రలేచి జనాల మీద పడుతుంటాయి.

పురాణాల్లోని భయంకరమైన రాక్షసులు ఒక్కొక్కటిగా బయటకి వస్తాయి. ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆ రాక్షసులతో ఫైట్ చేస్తూ, వాటిని ఎలా అంతం చేయాలో ప్లాన్లు వేస్తుంటారు. హీరోయిన్ అలెక్స్ కి కూడా కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయని ఆమెకి అప్పుడే అర్థమవుతుంది. చివరికి ‘హ్వోర్’ అనే ఒక పెద్ద రాక్షసుడు భూమి మీదకి రావడానికి ట్రై చేస్తాడు. వాడు వస్తే ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని ఈ గ్యాంగ్ గట్టిగా పోరాడుతారు. ఈ క్రమంలో ఎన్నో మలుపులు, భయంకరమైన సీన్లు ఉంటాయి. హీరోయిన్ తన శక్తులతో ఆ రాక్షసుడిని ఎలా ఆపిందో, ఆ గ్యాంగ్ లో ఎవరెవరు మిగిలారో అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : తండ్రి పరువు కోసం కొడుకు వేట… కోర్టులో మొదలయ్యే అసలైన ఆట… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×