OTT Movie : డిజిటల్ స్ట్రీమింగ్ కి మలయాళం సినిమాలు రావడమే ఆలస్యం, వీటిని వదలకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలు కూడా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలతో వస్తున్నాయి. గత ఏడాది ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించిన సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ కేరళలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతుంది. ఇక్కడికి కొత్తగా వచ్చిన ఒక టెనెంట్ ఫ్యామిలీ లేడీస్ ను అట్రాక్ట్ చేస్తాడు. ఇక వాళ్ళ భర్తలు గందరగోళంలో పడతారు. ఈ సినిమా సెటైరికల్ కామెడీతో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నడన్న సంభవం’ (Nadanna sambhavam) 2024లో విడుదలైన మలయాళ కామెడీ సినిమా. విష్ణు నారాయణ్ దర్శకత్వంలో, అనూప్ కన్నన్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో బిజు మేనన్ (శ్రీకుమారన్ ఉన్ని), సురజ్ వెంజరమూడు (అజిత్ నీలకంఠన్), లిజోమోల్ జోస్ (ధన్య), శ్రుతి రామచంద్రన్ (రోషి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.9/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2024 జూన్ 21న థియేటర్లలో విడుదలై, 2024 ఆగస్టు 9 నుండి మనోరమా మాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఇంట్లోకి శ్రీకుమారన్ ఉన్ని, అతని భార్య రోషి కొత్తగా వస్తారు. ఉన్ని హౌస్‌హస్బెండ్, ఇంటి పనులు చూసుకుంటాడు, రోషి ఆఫీస్‌కి వెళ్తుంది. ఇక ఖాళీ సమయంలో ఉన్ని జోవియల్‌గా, స్త్రీలతో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల కమ్యూనిటీలోని ఆడవాళ్లకు ఫేవరెట్ అవుతాడు. కానీ అజిత్, లింకన్ లాంటి మగవాళ్లకు ఇది కంటగింపుగా ఉంటుంది. అజిత్ ఒక నార్సిసిస్ట్, తన భార్య ధన్యతో సెక్సిస్ట్ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఉన్ని ఫ్రెండ్లీ బిహేవియర్‌పై అనుమానం పెంచుకుంటాడు. ఉన్ని ఫ్రెండ్లీ నేచర్ కమ్యూనిటీలో ఆడవాళ్లతో హిట్ అవుతుంది. కానీ అజిత్ దీన్ని పర్సనల్‌గా తీసుకుని, ఉన్నిని టార్గెట్ చేస్తాడు. ఈ జెలసీ అనుమానాలు ఒక పెద్ద గొడవకు దారితీస్తాయి, కమ్యూనిటీలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తాయి.
సెకండ్ హాఫ్‌లో అజిత్ అనుమానాలు మరింత పెరిగి, ఉన్నిపై రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడు. ఇది కమ్యూనిటీలో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ధన్య, అజిత్ నార్సిసిజం, సెక్సిస్ట్ బిహేవియర్‌తో విసిగిపోయి, ఉన్ని ఫ్రెండ్‌షిప్‌ని అప్రిషియేట్ చేస్తుంది. ఇది అజిత్‌ని మరింత రెచ్చగొడుతుంది. ఒక రోజు గొడవలో అజిత్, ఉన్ని మధ్య ఫిజికల్ కాన్‌ఫ్లిక్ట్ జరుగుతుంది. క్లైమాక్స్‌లో ఉన్ని నిజస్వరూపం, అతని ఫ్రెండ్లీ నేచర్ వెనుక ఉన్న ఇంటెన్షన్స్ బయటపడతాయి. అజిత్ తన సెక్సిస్ట్ బిహేవియర్‌ని రిఫ్లెక్ట్ చేసుకుంటాడు. కథ సెటైరికల్ హ్యూమర్, ఎమోషనల్ మూమెంట్స్‌తో ముగుస్తుంది.
Read Also : మనిషి మాంసం, రక్తం కోసం తహతహలాడే రాక్షస జీవులు… బ్లడీ బ్లడ్ బాత్… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్