Dunith Wellalage’s father : ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక విజయం సాధించిన సంతోషం కూడా లేకుండా పోయింది. శ్రీలంక జట్టులో విషాదం నెలకొంది. శ్రీలంక ఆటగాడు దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే కొలొంబోలో గుండెపోటుతో మరణించాడు. దీంతో జట్టుకి సంతోషం లేకుండా పోయింది. అయితే తన తండ్రి మరణించడంతో దునిత్ వెల్లాలగే కొలొంబోకి వెళ్తాడా..? లేక జట్టుతోనే ఉంటాడా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జట్టు సభ్యులు దునిత్ వెల్లాలగే ని ఓదార్చుతున్నారు. కొన్ని మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు కొందరూ ఆటగాళ్లు తమ తల్లి లేదా తండ్రి మరణించినా తమకు ఆటనే ముఖ్యమని జట్టుతోనే ఉంటారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన తండ్రి మరణించినప్పుడు ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు. 90 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి కాపాడిన తరువాతనే తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ.