E-Paper
Advertisement

OTT Movie : 7 భాషల్లో ఓటీటీలో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి కొడుకు వెబ్ సిరీస్… కానీ చిన్న ట్విస్ట్

OTT Movie : 7 భాషల్లో ఓటీటీలో రిలీజ్ అయిన విజయ్ సేతుపతి కొడుకు వెబ్ సిరీస్… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

OTT Movie : విజయ్ సేతుపతి కొడుకు సూర్య విజయ్ సేతుపతి ఫస్ట్ టైం ఓటీటీలో హీరో అవుతున్నాడు. ‘నడు సెంటర్’ అనే స్పోర్ట్స్ డ్రామా సరీస్ లో 17 ఏళ్ల బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటివరకు మూడు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. అయితే వారానికి ఒకటి చొప్పున మిగతా ఎపిసోడ్‌లను విడుదల చేయనున్నారు. క్రీడల నేపథ్యంలో స్టోరీలు ఇప్పుడు తక్కువగానే వస్తున్నా, ఈ సిరీస్ లో మాత్రం స్పోర్ట్స్ కంటెంట్ ని చక్కగానే వాడుకున్నారు. ట్రైలర్ చూస్తేనే ఇది ఏ పాటిగా ఉందో అర్థం అవుతుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివారాల్లోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే

ఇందులో పీకే అనే 17 ఏళ్ల బాస్కెట్‌ బాల్ ఆటగాడు, గతంలో ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు అతన్ని ఒక క్రమశిక్షణ లేని ఒక రౌడీ స్కూల్‌కి షిఫ్ట్ చేస్తారు. అక్కడి పిల్లలు ఫైటింగ్, డ్రగ్స్ లాంటి వాటితో సావాసం చేస్తుంటారు. వాళ్ళంతా ఒక క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని గ్యాంగ్. ఇక్కడ పీకేకి ఒక టాస్క్ ఇస్తారు. ఈ రౌడీలతో బాస్కెట్‌బాల్ టీమ్ పెట్టి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ గెలుచుకోవాల్సి ఉంటుంది. మొదట్లో అందరూ పీకేని “ఎవడ్రా నువ్వు?” అని కొడతారు. కానీ కోర్ట్‌లో బాల్ పట్టుకుని చెమట చిందించే అతని ఆట తీరు, మోటివ్ చూసి, ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగి, వీళ్ళంతా ఒక టీం అవుతారు. చివరికి ఆడియన్స్ కి ఒక సందేశం ఇచ్చే విధంగా ఈ సిరీస్ ఉంటుంది.

Advertisement

Read Also : ఐస్ ముక్కల మధ్య తెగిపడిన చెయ్యి… ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

నారు నారాయణన్ రూపొందించిన ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘నడు సెంటర్’ (Nadu Center) మొత్తం 17 ఎపిసోడ్లతో వచ్చింది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు రిలీజ్ అవ్వగా, మిగతా 14 ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి. ఇది 2025 నవంబర్ 20 నుంచి JioHotstarలో 7 భాషల్లో (తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ) ఒకేసారి రిలీజ్ అయింది. ఇందులో సూర్య SK, సూర్య విజయ్ సేతుపతి, సారా బ్లాక్, టెరెన్స్, ముఖేష్, డోమ్, యశ్వంత్, సహానా, మధువసంత్, ఆర్తి, కిషోర్, జీవా, నందగోపాల్, తారా అమలా జోసెఫ్ శివమ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×