Nadu centre OTT:సౌత్ బ్యూటీ రెజీనా కసాండ్రా (Regina Cassandra) ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఓ పక్క హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూనే.. మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఇంతకీ రెజీనా(Regina) నటించిన ఆ వెబ్ సిరీస్ ఏంటి..? జియో హాట్ స్టార్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది ? అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోయిన్లు ఒక పక్క సినిమాలు చేస్తూ.. మంచి మంచి పాత్రలు ఉంటే వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ముందుకు వస్తారు.
రెజీనా నాడు సెంటర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధం..
అలా రెజినా కసాండ్రా కూడా ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రెజీనా నటించిన ‘నాడు సెంటర్'(Nadu Center) అనే వెబ్ సిరీస్ త్వరలోనే జియో హాట్ స్టార్ లో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.. ఆక్వాబుల్స్ కంటెంట్ నిర్మించిన నాడు సెంటర్ వెబ్ సిరీస్ టీనేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో రెజీనా కసాండ్రా,సూర్య సేతుపతి, కలైయరసన్, మైమ్ గోపీ లతోపాటు కొంతమంది యువ నటీనటులను కూడా ఈ వెబ్ సిరీస్ కోసం తీసుకున్నారు. ఎప్పుడూ మంచి మంచి పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే రెజీనా కసాండ్రా నాడు సెంటర్ వెబ్ సిరీస్ లో కూడా మంచి పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న నాడు సెంటర్ అనే వెబ్ సిరీస్ లో రెజినా కసాండ్రా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక కోలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే నాడు సెంటర్ వెబ్ సిరీస్ ని జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రెజీనా కసాండ్రా సినిమాలు..
రెజీనా కసాండ్రా సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా రెజీనా.. అజిత్ (Ajith),త్రిష(Trisha ) కలిసి నటించిన విడాముయర్చి (Vidamuyarchi) సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో పాటు రెజీనాకి కూడా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు . ఇక రెజీనా కసాండ్రా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇక రెజీనా తెలుగులో చివరిగా నేనే నా అనే సినిమాలో చేసింది. ఇప్పటికే ఫర్జి, అన్యా’స్ ట్యుటోరియల్ వంటి వెబ్ సిరీస్ లో కూడా రెజీనా(Regina) నటించింది. అలా ఓ పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. మొత్తానికైతే వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో మరింత బిజీగా మారింది రెజీనా కసాండ్రా ఇక ఇప్పుడు నాడు సెంటర్తో రాబోతున్న ఈమె అటు ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.