Bommarillu Bhaskar : కొన్ని సినిమాలు చూడడానికి బాగున్న కూడా అవి రిలీజ్ అయిన టైం బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కమర్షియల్ సక్సెస్ సాధించవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దీనికి ఉదాహరణగా చాలా సినిమాలను చెప్పొచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత దర్శకుడుగా మళ్లీ సినిమా చేయడానికి బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా టైం పట్టింది. మళ్లీ రామ్ హీరోగా చేసిన ఒంగోలు గిత్త సినిమాతో దర్శకుడుగా తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆరెంజ్ సినిమా అప్పుడు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పుడు ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది.
రీసెంట్ టైమ్స్ లో పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆరెంజ్ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను ఎందుకు డిజాస్టర్ చేసామో అని బాధపడుతున్నారు. కొంతమంది ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ ను ఆరెంజ్ 2 సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరెంజ్ సినిమా చాలా త్వరగా బొమ్మరిల్లు భాస్కర్ తీసేసాడు. కరెక్ట్ టైం లో ఈ సినిమా రాలేదు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానిలో కూడా వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు ఆరెంజ్ సినిమా వస్తే ప్రేక్షకులు ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ ఇస్తారు. ప్రేమ కొంతకాలం మాత్రమే బాగుంటుంది అనే నిజాన్ని అప్పట్లో ఆడియన్స్ ఒప్పుకోలేకపోయారు. ఇప్పుడు ఆడియన్స్ కు మాత్రం రియలైజేషన్ వచ్చింది. ఆరెంజ్ సినిమా కథ చెబుతున్న తరుణంలోనే నాగబాబు పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేశారంట.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు బొమ్మరిల్లు భాస్కర్. పవన్ కళ్యాణ్ కి ఈ కథ విపరీతంగా నచ్చింది. ఇంత బాగా ఎలా రాసావ్ అని పవన్ కళ్యాణ్ అడిగారట. అంతేకాకుండా ఈ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ బొమ్మరిల్లు భాస్కర్ తో మాట్లాడినట్లు మరో సందర్భంలో కూడా భాస్కర్ చెప్పాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ లో కూడా ఒక దర్శకుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తను దర్శకత్వం వహించిన జానీ సినిమా అప్పట్లో భారీ డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకి మంచి స్టేటస్ ఉంది. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎలా చేశాడు అని అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం రీ రిలీజ్ సందర్భంగా ఆరెంజ్ సినిమా చూస్తున్న ఆడియన్స్ కూడా ఆ టైంలోనే ఈ పాయింట్ ఎలా పట్టుకున్నాడు అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
Also Read : Thani Oruvan 2 – AGS: ఏజీఎస్ ప్రొడక్షన్ హౌస్ త్రీ ఇయర్స్ లైనప్, తని ఒరువన్ పరిస్థితి 2 ఏంటి.?