Mangalavaram 2 :ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ సినిమా తర్వాత మంగళవారం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డీసెంట్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా 2023లో విడుదల అయ్యి థ్రిల్లర్ లవర్స్ కి మంచి అనుభూతి ఇచ్చింది అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ సినిమాగా వచ్చి, సూపర్ సక్సెస్ అందుకున్న మంగళవారం సినిమా ఓటీటీ లో విపరీతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మంగళవారం సినిమాను ముద్ర మీడియా వర్క్స్ స్వాతి ,సురేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రంలో పాయల్ , నందిత శ్వేత, అజయ్ ఘోష్, దివ్య ముఖ్యపాత్రలో నటించారు. అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ ఇద్దరు కలిసి చేసిన మొదటి సినిమ. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ ,హిందీ భాషలలో కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది .ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం ..
థ్రిల్లర్ తో పాటు మరో కోణం
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం చిత్రంలో పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కంటెంట్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి సీక్వెల్ రాబోతున్నట్టు, చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈసారి అజయ్ భూపతి ,ఆసక్తికరమైన కథతో మరింత థ్రిల్లర్ గా ఉండే కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. మంగళవారం సీక్వెల్ మరింత థ్రిల్లర్ గా అందరినీ భయపెడుతుందని చెప్పొచ్చు. హర్రర్ తో పాటు ఈసారి డివోషనల్ టచ్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.భక్తి కి థ్రిల్లర్ ను జోడించి తీసిన సినిమాలు చాలానే వచ్చాయి . ఈ సీక్వెల్ లో పాయల్ ను తీసుకుంటారా ,వేరే హీరోయిన్ తీసుకుంటారా అన్నది ఇంకా తెలియలేదు.అప్పట్లో ఈ సినిమాలో పాయల్ చేసిన క్యారెక్టర్ సెన్సేషన్ అని చెప్పాలి. అగ్ర హీరోయిన్స్ ఎవరు ఒప్పుకోకపోవడంతో ఈ సినిమాకు పాయల్ ఓకే చెప్పింది.
సీక్వెల్ తో భయపడతాను అంటున్న డైరెక్టర్..
ఒక మానసిక వైద్య సమస్యతో ,కొట్టుమిట్టాడే పాత్రను, అంత న్యాచురల్ గా చేయడం అంటే ఈజీ కాదు. అయినా పాయల్ ఈ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొని ,తన నటనతో అందరి మెప్పుపొందింది . మంగళవారం సినిమా సక్సెస్ అవ్వడంలో ,ఇంతటి ఇంపాక్ట్ కి రేట్ చేసినా హీరోయిన్ కు సీక్వెల్ లో భాగం కాకపోవడం షాపింగ్ న్యూస్ గా మారింది. మొదటి భాగంలో పాయల్ ఎంతో న్యాచురల్ గా చేసి విమర్శకుల ప్రశంసలు,మరియు అవాడ్స్ ను సైతం అందుకుంది .తెలుగులో పాయల్ కు మంచి సక్సెస్ తెచ్చిన ఈ సినిమా తరువాత మరే సినిమా తెలుగు లో రాలేదు.మరోసారి థ్రిల్లర్,డివోషనల్ జానర్ లో వస్తున్న ఈ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఆసిక్తి గా ఎదురుచూస్తున్నారు . కొత్త కథతో కొత్త హీరోయిన్ కి స్థానం కల్పించేలా ఈ సినిమా ను డైరెక్టర్ కీలక మార్పులు చేస్తారని తెలుస్తుంది.మంగళవారం సీక్వెల్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంగళవారం 2….
హార్రర్ విత్ డివోషనల్ టచ్
— devipriya (@sairaaj44) April 6, 2025