OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఉండే హాట్ సీన్స్ కు చాలా మంది ఫిదా అయిపోయారు. ఇందులో ఒక ప్రత్యేకమైన డీల్ స్టోరీని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. ఆ డీల్ ప్రకారం ఒక అమ్మాయి ఏడు రోజుల పాటు ఒక వ్యక్తి తో గడుపుతుంది. ఇందులో అలాంటి సీన్స్ బోలెడు ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియో
‘Naughty Girl’ 2023లో విడుదలైన రష్యన్ రొమాంటిక్ చిత్రం. దీనికి దిమిత్రి సువోరోవ్ దర్శకత్వం వహించాడు. ఇందులో అలెగ్జాండర్ పెట్రోవ్ (మాట్వే రైసాక్), అనస్తాసియా రెజ్నిక్ (ఎల్యా స్వెతాయెవా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 14న రష్యాలో విడుదలై, 1 గంట 28 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 4.6/10 ను అందుకుంది. 2024 మే 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్, ఆపిల్ టీవీలో రష్యన్ ఆడియోతో, హిందీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
ఇరవై ఏళ్ల ఎల్యా ఒక ఎకాలజీ స్టూడెంట్. ఆమె ఒక పాత ఫారెస్ట్ పార్క్‌ని కాపాడాలనే పట్టుదలతో ఉంటుంది. మాట్వే అనే ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ బాస్, ఆ పార్క్‌లో స్కైస్క్రాపర్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. ఎల్యా అతని ప్లాన్‌ని యూనివర్సిటీలో ఓపెన్‌గా ఛాలెంజ్ చేసి, నాశనం చేస్తుంది. మాట్వే, ఎల్యా ధైర్యానికి ఆకర్షితుడై, ఆమెను డబ్బుతో కొనాలని ట్రై చేస్తాడు. కానీ ఎల్యా దానిని తిరస్కరిస్తుంది. అప్పుడు మాట్వే ఒక బెట్ ప్రతిపాదిస్తాడు. తనతో ఏడు రోజులు రొమాంటిక్‌గా గడిపితే, పార్క్‌లో కట్టడం ఆపేస్తానని చెప్తాడు. ఎల్యా, పార్క్‌ని కాపాడేందుకు ఈ బెట్‌కి ఒప్పుకుంటుంది. కానీ మాట్వే ఆమె ఊహించినట్టు సాధారణ వ్యక్తి కాదని తెలుస్తుంది.
ఈ ఏడు రోజుల్లో మాట్వే ఎల్యాతో రొమాంటిక్ గా గడుపుతూ అతని ఛార్మ్‌కి లొంగిపోతుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు నీడ్ చేసుకుంటూ, కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో ఉంటారు. కానీ ఎల్యా తన ఎన్విరాన్‌మెంటల్ ఆదర్శాలను వదులుకోవాలా లేక మాట్వేను వదిలేయాలా అనే డైలమాలో పడుతుంది. ఇంతలో మాట్వే నిజమైన ఉద్దేశాలు బయటపడతాయి. క్లైమాక్స్ ఊహించని విధంగా టర్న్ తీసుకుంటుంది. చివరికి మాట్వే మాట మీద నిలబడతాడా ? మాట్వే తో ఎల్యా ఏడు రోజులు ఎలా గడుపుతుంది ? మాట్వే అసలు ప్లాన్ ఏమిటి ? ఎల్యా అతన్ని వదిలేస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : చావడానికెళ్లి సైకో చేతిలో అడ్డంగా బుక్… అమ్మాయిని కదలకుండా చేసి ఆ పని… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్