Tv Serial Actress : ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కువగా టీవీ నే మనం చూస్తూ ఉంటాం. ఇంట్లోని ఆడవాళ్లు టీవీలకు ఎంతగా అతుక్కుపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికితే చాలు రిమోట్ పట్టుకొని సీరియల్స్ పెట్టుకుంటారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో చాలామందికి తెలియదు. ఇంత అద్భుతంగా నటిస్తున్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆత్రుత కనబరుస్తుంటారు.. ఇదే కాదు గూగుల్ లో వెతికేస్తుంటారు కూడాను.. మరి ఇవాళ సీరియల్ లో నటిస్తున్న స్టార్ యాక్టర్స్ భర్తలు ఏం చేస్తుంటారో ఒక్కసారి చూసేద్దాం..
తేజస్విని గౌడ..
బుల్లితెర హీరోయిన్ తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయల అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. తెలుగు టీవీ చానల్స్ లలో అనేక సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలుసు. అతను కూడా ఒక సీరియల్ యాక్టర్.. ఆయన మరెవరో కాదు అమర్ దీప్. ఒకవైపు సీరియల్స్ మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో ఈయన సందడి చేస్తూ వస్తున్నాడు. ఇద్దరూ కెరియర్ పరంగా బిజీగానే ఉంటున్నారు.
శిరీష..
శిరీష తెలుగులో అనేక సీరియల్లలో నటించింది. మొగలిరేకులు సీరియల్ ద్వారా మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం, పున్నాగ వంటి సీరియల్లో నటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె నటుడు నవీన్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఇటీవలే కొన్ని కారణాలతో విడిపోయింది.
సుహాసిని..
టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సుహాసిని.. ఈ మధ్య బుల్లితెర పై సందడి చేస్తుంది. ప్రస్తుతం మామగారు సీరియల్ లో నటిస్తుంది. ఈమె భర్త పేరు ధర్మ. ఇతను సీరియల్ యాక్టర్..
కస్తూరి..
సినిమాల్లో పలు సినిమాలు చేసి ఇప్పుడు సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరోయిన్లలో ఒకటి కస్తూరి. ఈమె సీరియల్స్ కన్నా ఎక్కువగా కాంట్రవర్సీలతో ఫెమస్ అవుతుంది. తనకు సంబంధం లేని వాటిలో కూడా వేలు పెడుతుంది. ఈమె భర్త పేరు రవి కుమార్.. ఈయన ఒక డాక్టర్..
Also Read: బుధవారం టీవీల్లోకి బోలెడు చిత్రాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
మంజుల పరిటాల..
చంద్రముఖి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మంజుల.. ఈమె గురించి అందరికి తెలుసు. ఈమె భర్త పేరు నిరూపం పరిటాల. ఇతను ఫేమస్ నటుడే.. వీరిద్దరు కూడా బుల్లితెర పై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఆ లిస్ట్ లో ఉంటారు. నటన అంటే ఫ్యాషన్ తో చాలా మంది ఇలా సీరియల్స్ చేస్తున్నారు.