BigTV English

OTT Movie : కన్న కూతురు అని కూడా చూడకుండా… ఈ తండ్రి చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : కన్న కూతురు అని కూడా చూడకుండా… ఈ తండ్రి చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అత్తా, కోడళ్ళ సీరియల్స్ కి బదులు, వీటినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. వీటిలో కొన్ని సిరీస్ లు చాలా డిఫెరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్, పాకిస్థాన్ ఇండస్ట్రి నుంచి వచ్చింది. ఇందులో ఒక తండ్రి తన కూతుర్ని, ఇరవై సంవత్సరాలు ఒక బేస్మెంట్ లో బంధిస్తాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

రిష్టీనా అనే యువతి ఒక చిన్న గ్రామంలో, తన తల్లి దండ్రులతో కలసి జీవిస్తుంటుంది. ఆమె తండ్రి దర్వైష్ ఖాన్, ఆమెను చిన్నప్పటి నుంచి బయటి ప్రపంచం నుండి దాచిపెడతాడు. తన ఇంట్లోనే ఉన్న ఒక బేస్మెంట్ లో ఉంచుతాడు. పదహారు సంవత్సరాలు వచ్చేంతవరకూ కనీసం ఇంటి బయటికికూడా పంపకుండా ఉంటాడు. ఆమెకు అన్ని ఏర్పాట్లు బేస్మెంట్ లోనే ఏర్పాటు చేస్తాడు. నిజానికి ఆమె తల్లిదండ్రులు వేరేవాళ్ళు. రిష్టీనా తల్లి, భర్తతోకాకుండా, వేరొకరితో ప్రెగ్నెంట్ అవుతుంది. అలా పుట్టిన బిడ్డే రిష్టీనా.  ఆ విషయం తెలిసి కుటుంబ సభ్యులు రిష్టీనాను చంపాలని చూస్తారు. ఈ క్రమంలోనే రిష్టీనాను కాపాడి, బయట ప్రపంచంకు తెలీకుండా పెంచుతాడు దర్వైష్ ఖాన్. ఒక రోజు ఈ విషయం రిష్టీనాకు దర్వైష్ ఖాన్ చెప్పాల్సి వస్తుంది.


ఇక రిష్టీనాను ఆ గ్రామంలో ఉంచకుండా సిటీ కి పంపుతాడు ఆమెను పెంచిన తండ్రి. అక్కడ రిష్టీనా సోషల్ మీడియా మాయలో పడిపోతుంది. రిష్టీనా తన కెరీర్‌ను సోషల్ మీడియాలో నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఒక రౌడీ ఆమెను వెంబడిస్తాడు. ఆమెను రక్షించడానికి రుస్తోమ్ అనే వ్యక్తి ఆ రౌడీని చంపుతాడు. చివరికి బయట ప్రపంచంలో, రిష్టీనా ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటుంది ? ఆమెను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తారు ? సోషల్ మీడియా వల్ల ఆమెకు, ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ? మళ్ళీ తను సొంత ఊరిలో ధైర్యంగా తిరగగలుగుతుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ పాకిస్థాన్ టెలివిజన్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా

 

యూట్యూబ్ (Youtube) లో

ఈ పాకిస్తానీ టెలివిజన్ సిరీస్ పేరు ‘నౌరోజ్’ (Nauroz). 2023 లో వచ్చిన ఈ మూవీకి షాజాద్ కాశ్మీరీ దర్శకత్వం వహించారు. నుక్తా ప్రొడక్షన్స్, మల్టీవర్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ సిరీస్‌ ను నిర్మించారు. ఈ సిరీస్‌లో మావ్రా హొకేన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ స్టోరీ ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ ఆసక్తికరంగా సాగిపోతుంది. ఇది గ్రీన్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రసారమైంది. ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×