BigTV English

IndiGo Salaries: అమ్మో.. ఇండిగో క్యాబిన్ క్రూ సాలరీ అంతా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

IndiGo Salaries: అమ్మో.. ఇండిగో క్యాబిన్ క్రూ సాలరీ అంతా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

IndiGo Airlines Cabin Crew Salary: ఇండిగో ఎయిర్ లైన్స్. భారత్ కు చెందిన చౌక విమానయాన సంస్థ. గుర్గావ్ లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండిగో..  2014 డిసెంబరు నాటికి 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది. ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్  కంపెనీ నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఏప్రిల్ 2025 నాటికి, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ  దేశీయ విమాన ప్రయాణ మార్కెట్‌ లో 63%  వాటాను కలిగి ఉంది.  ప్రయాణీకుల పరిమాణం పరంగా ఆసియాలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 2023లో 100 మిలియన్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్యారియర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ ప్రస్తుతం 91 దేశీయ, 37 అంతర్జాతీయ ప్రదేశాలలో 129 డెస్టినేషన్స్ ను కనెక్ట్ చేస్తోంది. రోజూ 2,200 కంటే ఎక్కువ విమానాలను నడిపిస్తున్నది. ఇండిగో అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వారికి సంస్థ మంచి వేతనాలు అందిస్తోంది. ఇంతకీ ఇండిగో ఎయిర్ లైన్స్ క్యాబిన్ క్రూకు ఎంత సాలరీ ఇస్తారంటే..


ఏడాదికి రూ. 3.6 నుంచి 10 లక్షల ప్యాకేజీ

ఇండిగో ఎయిర్ లైన్స్  సంస్థ దేశంలో తన క్యాబిన్ సిబ్బందికి వార్షిక ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ. 3.6-10 లక్షల వరకు అందిస్తుంది. స్టార్టింగ్ నుంచి 5 ఏళ్లు పని చేసిన సగటు సిబ్బందికి ఏడాదికి సగటు జీతం  ₹5.4 లక్షలుగా నిర్ణయించింది. ఇండిగో ఉద్యోగులు అంబిషన్ బాక్స్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం ఈ వివరాలు వెల్లడి అయ్యాయి.


2025లో ఇండిగో క్యాబిన్ క్రూ సాలరీ జీతం

దేశంలోని ఇండిగో క్యాబిన్ క్రూ సాలరీ సంవత్సరానికి సగటున రూ. 5.4 లక్షలుగా ఉంది. ఎక్స్ పీరియెన్స్ ఆధారంగా రూ. 3.6-10 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ సంస్థలో సంవత్సరానికి రూ. 7 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగులలో 10 శాతం మంది ఉన్నారు. ఏడాదికి రూ.8 లక్షలకు పైగా సంపాదించే వారిలో ఒకశాత మంది ఉన్నారు. టీమ్ అసైన్‌మెంట్, అనుభవం, బోనస్‌లు, స్టాక్ ఆప్షన్‌ ల లాంటి అదనపు పరిహార అంశాలను బట్టి సాలరీ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎంట్రీ లెవల్ ఉద్యోగుల సాలరీ ఎంత ఉంటుందంటే?

ఇండిగో ఎంట్రీ-లెవల్ ఫ్లైట్ అటెండెంట్‌లు సంవత్సరానికి సుమారు రూ. 4.9 లక్షల ప్యాకేజీని తీసుకుంటారు.  నెలవారీ సాలరీ రూ. 37,000 నుంచి రూ. 38,000 మధ్య ఉంటుంది. ఈ సంస్థలో ఎక్స్ పీరియెన్స్ పెరిగే కొద్దీ సాలరీ పెరుగుతుంది. సుమారు 2 ఏళ్ల అనుభవం ఉన్న క్యాబిన్ సిబ్బందికి నెలకు రూ. 42,000 నుంచి రూ. 43,000 వరకు అందిస్తారు. ఏడాదికి రూ. 5.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు లభిస్తాయి. ఇక సీనియర్ ఇండిగో క్యాబిన్ సిబ్బందికి ఎక్కువ మొత్తంలో సాలరీ పొందే అవకాశం ఉంటుంది. సుమారు 5 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగులు ఏడాదికి  రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల ప్యాకేజీ అందుకుంటారు.

క్యాబిన్ సిబ్బంది ప్యాకేజీలో లభించే ప్రయోజనాలు

ఇండిగో క్యాబిన్ సిబ్బందికి ఇచ్చే ప్యాకేజీలో బీమా కవరేజీ, ఉచిత కౌన్సెలింగ్ సేవలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు, అన్ని హబ్‌ లలో డే కేర్ సౌకర్యాలు, ఛారిటబుల్ గివింగ్ అవకాశాలు కల్పిస్తారు. ఇక ఇండిగో క్యాబిన్ క్రూ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు కంపెనీకి ఎందిన jobs.goindigo.inలో నోటిఫికేషన్లను చూడాలి. అర్హత కలిగిన పోస్టులకు అప్లై చేసుకోవాలి. పరీక్షల అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది ఇండిగో సంస్థ.

Read Also:  విశాఖ నుంచి నేరుగా ఆ దేశానికి విమానాలు.. ఇక ఆ సమస్య లేనట్లే!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×