Indian railways: దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వేలాది మంది రైల్వే ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. ప్రత్యేకంగా పండుగలు, ఇతర సందర్భాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో హడావిడి, పరధ్యానం కారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను మర్చిపోయి రైలు దిగేస్తారు. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తమ వస్తువులను మర్చిపోయామని గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో మీ వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉందా? ఒకేవేళ మీ వస్తువులను మర్చిపోతే ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ప్రయాణీకులు రైళ్లలో మర్చిపోయిన వస్తువులను తిరిగి పొందేందుకు భారతీయ రైల్వే తగిన చర్యలు తీసుకుంటున్నది. సుదూర రైళ్లలో కనీసం ఇద్దరు రైల్వే పోలీసు అధికారులు ఆన్ బోర్డ్ ఎస్కార్ట్ లుగా ఉంటారు. మీరు రైలు దిగిన తర్వాత మీ వస్తువులను మర్చిపోయినట్లు గుర్తిస్తే, వీరికి సమాచారం అందించాలి. వారి సాకారంతో తదుపరి స్టేషన్ లో మీ వస్తువులను పొందే అవకాశం ఉంటుంది.
⦿ ప్రతి జిల్లాలో సాధారణంగా రైల్వే ప్రధాన ప్రధాన కార్యాలయంతో పాటు మూడు నుంచి ఐదు రైల్వే పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ప్రయాణీకులు ఒకవేళ రైల్లో తమ వస్తువులను మర్చిపోతే, ఈ స్టేషన్లలో విషయం చెప్పాలి. ఈ ఫిర్యాదులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిష్కరిస్తారు.
మర్చిపోయిన వస్తువులను ఎలా రికవరీ చేస్తారంటే?
ప్రయాణీకుడు తన వస్తువులను రైల్లో మర్చిపోయినట్లు RPF, GRPకి ఫిర్యాదు చేసిన తర్వాత, రైలులోని ఎస్కార్టింగ్ పోలీసు అధికారులకు అలర్ట్ పంపబడుతుంది. మర్చిపోయిన వస్తువులను భద్రపరచడానికి, వెంటనే రికవరీ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. రైల్లో దొరికన వస్తువులను రిపోర్టింగ్ స్టేషన్ కు తిరిగి పంపుతారు. సరైన ధృవీకరణతో అసలైన యజమానికి అప్పగిస్తారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కేసును రైల్వే పోలీసులు అత్యంత వేగంగా సాల్వ్ చేశారు. అనకాపల్లి నుంచి అన్నవరం వెళ్లే ఒక వ్యక్తి తన ల్యాప్ టాప్ ను రైలులోనే మర్చిపోయాడు. అతడు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే, వారు ట్రైన్ లో ఉన్న ఎస్కార్ట్ అధికారులను అలర్ట్ చేశారు. ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని అదే రోజు ప్రయాణీకుడికి అందజేశారు.
రైల్లో ఏవైనా వస్తువులను పోగొట్టుకుంటే వెంటనే చేయాల్సిన పనులు
⦿ సమీపంలోని RPF, GRP స్టేషన్ లోని అధికారులు వెంటనే చెప్పండి.
⦿ వారికి రైలు వివరాలను అందించండి(రైలు నంబర్, కోచ్, సీటు, బోర్డింగ్ సమయం).
⦿ పోగొట్టుకున్న వస్తువుల వివరణను చెప్పండి.
⦿ ధృవీకరణ కోసం మీ టికెట్, ప్రయాణ IDని సిద్ధంగా ఉంచుకోండి.
వీలైనంత త్వరగా రైల్వే పోలీసులకు విషయాన్ని చెప్పడం వల్ల మీ వస్తువులను సేఫ్ గా పొందే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎవరైనా పట్టుకెళ్లే అవకాశం ఉంటుంది.
Read Also: గుడ్ న్యూస్.. వాట్సప్ నుంచే రైలు టికెట్ల బుకింగ్, కేవలం వారికి మాత్రమే!