OTT Movie : హర్రర్, మిస్టరీ, సర్వైవల్ థ్రిల్లర్స్ ఉత్కంఠభరితమైన కథలతో, ఊహించని మలుపులతో అందరినీ ఆకర్షిస్తాయి. అందులోనూ ఇలాంటి కొరియన్ డ్రామాలను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే, ఎండ్ అయ్యేదాకా ఆపలేము. ఒకవైపు భయంకరమైన మరణాలు, మరోవైపు మనసును కదిలించే సీక్రెట్స్, మధ్యలో స్నేహం – ద్రోహం కలిసిన స్టోరీ కావాలంటే, ఈ సిరీస్ మీ కోసమే. ఈ సిరీస్ ఒక డెత్ గేమ్‌లో చిక్కుకున్న హైస్కూల్ విద్యార్థుల గురించి ఉంటుంది. ఎవరు మాఫియా, ఎవరు సాధారణ విద్యార్థి అని కనుగొనే ప్రయత్నంలో కథ నడుస్తుంది. ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ థ్రిల్లర్ పేరు ‘Night Has Come’. 2023లో రిలీజ్ అయిన ఈ సిరీస్ 12 ఎపిసోడ్‌లతో సాగుతుంది. లిమ్ డే-వూంగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో లీ జే-ఇన్ (లీ యూన్-సియో), కిమ్ వూ-సియోక్ (కిమ్ జూన్-హీ), చోయ్ యే-బిన్ (ఓహ్ జంగ్-వోన్), చా వూ-మిన్ (గో క్యుంగ్-జున్), అన్ జి-హో (జిన్ డా-బియోమ్), జంగ్ సో-రి (కిమ్ సో-మి) తదితరులు నటించారు. ఈ సిరీస్ గ్రిప్పింగ్ స్టోరీ, యంగ్ యాక్టర్స్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఇందులో ఉన్న హర్రర్, సస్పెన్స్, బ్లడీ వయొలెన్స్ సీన్స్ 2023లో దీనిని ఒక యూనిక్ టీన్ థ్రిల్లర్‌గా నిలిపాయి.
స్టోరీలోకి వెళ్తే…
యూయిల్ హైస్కూల్ లో చదువుతున్న విద్యార్థుల కథ ఇది. ఈ పిల్లలంతా కలిసి వెకేషన్ కు వెళ్తారు. కానీ అక్కడ ఒక భయంకరమైన “మాఫియా గేమ్”లో చిక్కుకుంటారు. ఈ గేమ్‌లో విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌ల ద్వారా ఓటు వేసి, మాఫియా ఎవరో కనుక్కోవాలి. అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తికి ఆ రాత్రి చావు తప్పదు. అలా మాఫియా ప్రతి రాత్రి ఒకరిని చంపుతుంది. గేమ్ నుండి బయటపడే ఏకైక మార్గం మాఫియాను కనుగొని, వారిని ఓటు ద్వారా తొలగించడం.
లీ యూన్-సియో (లీ జే-ఇన్) అనే తెలివైన, బ్రేవ్ అమ్మాయి ఈ గేమ్‌లో మాఫియాను కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె స్నేహితులు కిమ్ జూన్-హీ (కిమ్ వూ-సియోక్) అనే పాపులర్ క్లాస్ ప్రెసిడెంట్, ఓహ్ జంగ్-వోన్ (చోయ్ యే-బిన్) అనే సైలెంట్ అమ్మాయితో కలిసి ఆమెతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. కథలో గో క్యుంగ్-జున్ (చా వూ-మిన్), జిన్ డా-బియోమ్ (అన్ జి-హో) అనే మరో నీరసమైన విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తారు. యూన్-సియో అనే అమ్మాయి ఫ్యూచర్ ను చెబుతుంది. పార్క్ సీ-యున్ గురించి విజన్స్ చూస్తుంది. ఆమె ఈ గేమ్‌తో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది.
Read Also : సినిమా ఛాన్స్ కోసం డైరెక్టర్ తో భార్య రాసలీలలు… ఆ భర్త ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్