CM Revanth Reddy : చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌లోనూ డ్రగ్స్, గంజాయి కలిపి అమ్ముతున్నారు.. స్కూల్స్ దగ్గరా ఈ దందా నడుస్తోంది. అందుకే డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా “ఈగల్” అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో గంజాయి ఎక్కడ పండించినా, ఎలా రవాణా చేసినా, అమ్మినా.. ఈగల్ టీమ్ పసిగడుతుందని చెప్పారు. TGNAB ఇకనుంచి EAGLE (ELITE ACTION GROUP FOR DRUG LAW ENFORCEMENT) గా మారుతుందని అన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ యువత డ్రగ్స్ మహమ్మారికి బలి కావడం న్యాయమా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు వేదిక కావద్దొన్నారు.
నాలాగే నల్లమల నుంచి..
నల్లమల నుంచి వచ్చిన తాను.. ZPTC స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని.. నాలాగే విజయ్ దేవరకొండ సైతం నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి చేరారని అన్నారు. కష్టం, కమిట్‌మెంట్ లేకుండా ఇంతలా ఎవరూ రాణించలేరని చెప్పారు. హీరో రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ మాదిరిగానే.. మాదక ద్రవ్యాల నియంత్రణకు అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. నో డ్రగ్స్‌కు ప్రజలే వారధులుగా మారాలని కోరారు.
రాజకీయాల్లో స్పోర్ట్స్ కోటా..
ఏ పాలసీ లేని తెలంగాణలో.. తాము అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని సీఎం చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని.. చదువులు, స్పోర్ట్స్‌లో రాణించి హీరోలుగా నిలవాలని రేవంత్ అన్నారు. ఉద్యోగాల్లోనే కాదు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒక్క ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కూడా రాకపోవడంపై ఆలోచించాలని అన్నారు.
అడుగుపెట్టాలంటే భయపడేలా..
పాఠశాలలు, కళాశాలల్లో అసాంఘీక కార్యకలాపాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్‌ను మార్గంగా ఎంచుకున్నాయని చెప్పారు. పంజాబ్‌లో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి అక్కడి యువత నిర్వీర్యమైందని.. తెలంగాణలో అలా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మాదక ద్రవ్యాలు తరలించే వాళ్లు తెలంగాణ సరిహద్దుల్లో అడుగు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తాను ఆదేశాలు ఇచ్చానని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
EAGLE…
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.శిక్షణ పొందిన… pic.twitter.com/veqcwzLJ9G
— Revanth Reddy (@revanth_anumula) June 26, 2025