E-Paper
Advertisement

రెంటు తక్కువని వెళ్తే డైరెక్ట్ నరకమే… పొరపాటున పడుకునే ముందు ఈ హర్రర్ మూవీని చూడొద్దు భయ్యా

రెంటు తక్కువని వెళ్తే డైరెక్ట్ నరకమే… పొరపాటున పడుకునే ముందు ఈ హర్రర్ మూవీని చూడొద్దు భయ్యా
Advertisement

Supernatural Thriller : 2021లో నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా హారర్ ఫ్యాన్స్‌ను వణికించిన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘నో వన్ గెట్స్ అవుట్ అలైవ్’ (No One Gets Out Alive 2021 Movie). ఆడమ్ నెవిల్ రాసిన ప్రముఖ నవల ఆధారంగా దర్శకుడు శాంటియాగో మెన్ఘిని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వలసదారుల కష్టాలు, ఒంటరితనం, పురాతన రాక్షస శక్తిని మేళవించి భయంకరంగా తెరకెక్కించారు. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కథానాయిక ఆంబర్ (క్రిస్టినా రోడ్లో) మెక్సికో నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారురాలు. తల్లి మరణం తర్వాత మంచి భవిష్యత్తు కోసం క్లీవ్‌ల్యాండ్ నగరానికి వెళ్తుంది. కానీ చట్టబద్ధమైన పత్రాలు లేకపోవడంతో ఎక్కడా స్థిరపడలేక, చివరికి రెడ్ (మార్క్ మెంచాకా) నడుపుతున్న ఒక పాత, చౌకైన మహిళల హాస్టల్‌ లో గది అద్దెకు తీసుకుంటుంది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే ఆంబర్‌ కు వింత వింత శబ్దాలు, ఏడుపులు, భయంకరమైన కలలు వస్తుంటాయి. అక్కడ బస చేసిన ఇతర వలస మహిళలు ఒక్కొక్కరుగా అదృశ్యమవడం ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది.

Advertisement

ఈ షాకింగ్ ట్విస్ట్ తో ఎలాగైనా ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ డబ్బు లేకవపోవడంతో మోసపోయి మళ్లీ అదే హాస్టల్‌ కు తిరిగి రావాల్సి వస్తుంది. హాస్టల్ యజమాని రెడ్, అతని మానసిక రోగి సోదరుడు బెకర్ ఆ ఇంట్లో ఒక భయంకరమైన రహస్యాన్ని దాచి ఉంచారని ఆంబర్‌ కు తెలుస్తుంది. వారి తండ్రి పురాతన పురావస్తు శాస్త్రవేత్త. అతను మెక్సికో నుంచి ఒక వింత ఆజ్టెక్ రాక్షస శక్తి ఉన్న పురాతన రాతి పెట్టెను తీసుకొచ్చాడు. ఆ పెట్టెలో ఉన్న రాక్షసికి అమ్మాయిలను బలి ఇస్తే తమ కుటుంబ సమస్యలు తీరతాయని ఆ సోదరులు నమ్ముతారు. చివరకు ఆంబర్‌ను కూడా బలిపీఠంపై కట్టేసి ఆ పెట్టె ముందు ఉంచుతారు. అక్కడి నుంచి సగం మనిషి, సగం సాలీడు ఆకారంలో ఉన్న భయంకర రాక్షసి బయటకు వస్తుంది. ఆ ప్రాణాంతక సమయంలో ఆంబర్ ఎలా తప్పించుకుంటుంది ? ఆ క్రూరమైన సోదరులపై ఎలా పగ తీర్చుకుంటుంది ? అనేది సినిమా.

ఎక్కడ చూడాలి ?

ఈ హారర్ థ్రిల్లర్ లో వలసదారులు ఎదుర్కొనే ఒంటరితనం, బాధ, భయం, పురాణాలను కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించారు. క్రిస్టినా ఆంబర్ పాత్రలో భయం, ధైర్యం, ఆవేశం ఉన్న అమ్మాయిగా బాగా నటించింది. మార్క్ మెంచాకా రెడ్‌ గా భయపెట్టాడు. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ సినిమా ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఆడియోతో పాటు వివిధ భాషల సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. రాత్రి సమయంలో ఒంటరిగా చూస్తే మరింత భయం పుట్టిస్తుంది. కాబట్టి సింగిల్ గా చూసే ధైర్యం చేయకండి.

Advertisement

Read Also : ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×