Romantic Sports Comedy: ప్రేమను కాపాడుకోవాలా, లేక తమ తమ కెరీర్‌ల కోసం వెళ్లాలా అనే పరిస్థితి ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ ‘Sidelined 2: Intercepted’. నోహ్ బెక్, సియెన్నా అగుడాంగ్ మరోసారి డ్రేటన్, డల్లాస్‌గా కనిపించారు. మొదటి పార్ట్ లో హైస్కూల్‌లో మొదలైన వీరి ప్రేమ ఈసారి కాలేజ్ జీవితంలో కొత్త పరీక్షను ఎదుర్కొంటుంది. డ్రేటన్ ఓ తీవ్రమైన ఎదురుదెబ్బ తర్వాత ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, డ్యాన్సర్ డల్లాస్ తాను ఎంచుకున్న భవిష్యత్తు నిజంగా తనకు కావాల్సిందేనా అని ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ సీక్వెల్‌లో ప్రేమ, ఫుట్‌బాల్, డ్యాన్స్, ఫ్రెండ్‌షిప్ అన్నీ కలిసిపోతాయి. మరి డ్రేటన్ కెరీర్‌కు ఎదురైన ఆ సమస్య ఏంటి? డల్లాస్ ఎందుకు తన భవిష్యత్తుపై సందిగ్ధంలో పడింది? వీళ్ల ప్రేమ ఈ దూరాన్ని తట్టుకుని నిలిచిందా? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
డ్రేటన్ లాహే, డల్లాస్ బ్రయాన్ హైస్కూల్‌లో మొదలైన తమ ప్రేమను కాలేజ్‌లోనూ కొనసాగించాలని అనుకుంటారు. కానీ ఇద్దరూ వేర్వేరు దారుల్లో అడుగుపెట్టడంతో పరిస్థితులు మారిపోతాయి. USCలో ఫ్రెష్‌మన్ స్టార్ క్వార్టర్‌బ్యాక్‌గా అడుగుపెట్టిన డ్రేటన్‌పై భారీ అంచనాలు ఉంటాయి. అయితే అతడికి ఎదురయ్యే ఓ తీవ్రమైన ఎదురుదెబ్బ అతడి ఫుట్‌బాల్ కెరీర్‌ను కష్టాల్లోకి నెడుతుంది.
మరోవైపు డల్లాస్ తన డ్యాన్స్ కలను సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగుతుంది. కొత్త కాలేజ్, కొత్త స్నేహితులు, కొత్త అవకాశాల మధ్య తనకు నిజంగా ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో స్కైలర్ అనే మ్యూజిషియన్‌తో ఆమెకు పరిచయం కూడా ఏర్పడుతుంది. దీంతో డ్రేటన్, డల్లాస్ మధ్య దూరం మరింత పెరుగుతుంది. ప్రేమను కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఇద్దరూ తమ వ్యక్తిగత లక్ష్యాలు, కెరీర్‌లతో పోరాడాల్సి వస్తుంది. చివరికి ఈ రిలేషన్‌షిప్‌ను కొనసాగించగలరా? లేక జీవితంలో వేర్వేరు దారులు ఎంచుకుంటారా? అనేదే కథలో అసలు ఎమోషన్.
జస్టిన్ వూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నోహ్ బెక్, సియెన్నా అగుడాంగ్, డ్రూ రే టానర్, జేమ్స్ వాన్ డెర్ బీక్, చార్లీ గిల్లెస్పీ, రోన్ కర్టిస్ తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 40 నిమిషాలు. JioHotstarలో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమతో పాటు స్పోర్ట్స్, డ్యాన్స్, కాలేజ్ లైఫ్, కెరీర్ గోల్స్ కలిసిన యూత్‌ఫుల్ కథలు ఇష్టపడేవారికి ‘Sidelined 2: Intercepted’ ఓ లైట్‌హార్టెడ్ వాచ్.
Read Also: అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్