E-Paper
Advertisement

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్
Advertisement

Psychological Thriller Series: ఒక తల్లి తన బిడ్డను చూసుకోవడానికి ఇంట్లోకి కేర్‌ టేకర్‌ ను తీసుకొస్తే సాధారణంగా ఏం జరుగుతుంది ? బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ, కుటుంబంతో కలిసిపోతే అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ అదే కేర్‌ టేకర్‌ కు ఆ బిడ్డపై హద్దులు దాటిన అనుబంధం ఏర్పడి, అంతలోనే ఆమె గతంలో దాచిన ఒక భయంకరమైన రహస్యం బయటపడితే… తన కుటుంబం చుట్టూ ఏదో కుట్ర జరుగుతోందని అనుమానించిన ఓ తల్లి చివరికి ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంది ? ఇలాంటి మైండ్ గేమ్స్‌తో సాగే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌నే ‘నాట్ ఏ స్ట్రేంజర్’ (Not A Stranger). ఈ థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే…

కథలోకి వెళ్తే…

ఈ కథలో ఫుండా టాలెంటెడ్ చిత్రకారిణి. పెళ్లై, బిడ్డ పుట్టడంతో కుటుంబ బాధ్యతల కోసం కొంతకాలం తన ఆర్ట్ కెరీర్‌ కు దూరంగా ఉంటుంది. పాప కొంచెం పెద్దయ్యాక మళ్లీ పెయింటింగ్‌ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో బిడ్డను చూసుకోవడానికి నాజ్లీ అనే కేర్‌ టేకర్‌ను ఇంట్లోకి తీసుకొస్తుంది. మొదట్లో నాజ్లీ చాలా పద్ధతిగా, ప్రేమగా వ్యవహరిస్తుంది. పాపను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడంతో ఫుండా కుటుంబం కూడా ఆమెను పూర్తిగా నమ్ముతుంది. ఫుండా తన పెయింటింగ్స్‌పై దృష్టి పెట్టడంతో ఇంటి బాధ్యతల్లో నాజ్లీ పాత్ర కూడా పెరుగుతుంది.

Advertisement

కానీ కొద్దిరోజులకు ఆమె ప్రవర్తనలో చిన్నచిన్న మార్పులు కనిపించడం మొదలవుతుంది. పాపపై నాజ్లీ చూపించే శ్రద్ధ సాధారణ కేర్‌టేకర్‌ది కాదని ఫుండాకు అనిపిస్తుంది. బిడ్డను తన సొంత బిడ్డలా భావించే స్థాయికి ఆమె వెళ్లిపోవడంతో అనుమానాలు మొదలవుతాయి. అసలు నాజ్లీ ఎవరు ? ఆమె గతం ఏంటి ? ఎందుకు ఈ కుటుంబంలోకి వచ్చింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న ఫుండాకు ఊహించని నిజాలు తెలుస్తాయి.

అక్కడి నుంచే కథ మరో మలుపు తీసుకుంటుంది. నాజ్లీ గతానికి ఇల్కేర్ తో ఉన్న ఒక డార్క్ కనెక్షన్ బయట పడుతుంది. ఆమె ఈ ఇంట్లోకి యాదృచ్ఛికంగా రాలేదని, చాలా కాలం నుంచి ఏదో ఒక లక్ష్యంతో అడుగులు వేస్తోందనే అనుమానం బలపడుతుంది. ఫుండా కుటుంబంలో నమ్మకం క్రమంగా దెబ్బతింటుంది. నాజ్లీ మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె దాచే విషయాలు ఒక్కొక్కటిగా మరింత భయాన్ని పెంచుతాయి. ఇదే సమయంలో నాజ్లీ తన మైండ్ గేమ్స్‌తో ఫుండాను మానసికంగా ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

ఫుండా చెబుతున్న మాటలను ఇతరులు నమ్మకుండా చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. భర్త ఇల్కేర్‌ కూడా ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలోకి వెళ్తాడు. బిడ్డ భద్రత కోసం పోరాడుతున్న ఫుండా, తన ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఉద్దేశాన్ని ఎలా బయటపెట్టింది ? నాజ్లీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఫుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సిరీస్‌ను చూడాల్సిందే.

తెలుగులో ఎక్కడ చూడవచ్చు ?

‘నాట్ ఏ స్ట్రేంజర్’ సిరీస్‌ ను నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 17 నుంచి చూడొచ్చు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ టర్కిష్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు మెర్ట్ బైకాల్ (Mert Baykal) దర్శకత్వం వహించారు. ఎల్చిన్ సంగు (Elçin Sangu), మెలిస్ సెజెన్ (Melis Sezen), ఓజాన్ డోలునాయ్ (Ozan Dolunay) కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. టర్కిష్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ లో చూడొచ్చు.

Read Also: జపాన్  సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

Tags

Related News

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

Big Stories

Advertisement
×