OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లు, కొత్త కొత్త స్టోరీలతో కేక పుట్టిస్తున్నాయి. వీటిలో కామెడీ జోనర్లో వస్తున్న సిరీస్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సిరీస్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. తహసీల్దార్ ఆఫీస్ లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల, రోజువారి కార్యక్రమాలతో సరదాగా ఈ సిరీస్ సాగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో
ఈ తమిళ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘ఆఫీస్’ (Office). దీనికి అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ఒక చిన్న గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగే కామెడీ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో గురు లక్ష్మణ్, స్మేహ మణిమేగలై, కీర్తివేల్, వైశాలి కేమ్కర్, తమిర్వాణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ 2025 ఫిబ్రవరి 21 నుంచి జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక గ్రామీణ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. అక్కడికి ఒక డిప్యూటీ తహసీల్దార్ ట్రాన్స్ఫర్లో వస్తాడు. ఇక అందులోని ఉద్యోగులను కంట్రోల్ లో పెట్టడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. అయితే అతని మాటను ఎవరూ పెద్దగా పట్టించకోరు. తహసీల్దార్ ఒక టెంపుల్ కి వెళ్లడంతో, ఒక చిన్న గందరగోలం ఏర్పడుతుంది. ఒక కంప్యూటర్ ఇంజనీర్ అయిన పారి తహసీల్దార్ ని కలవడానికి అక్కడికి వస్తాడు. అదే సమయంలో కలెక్టర్ ఇనస్పెక్షన్ కి వస్తున్నట్లు సమాచారం వస్తుంది. పారిని కలెక్టర్ గా భావించి అక్కడ ఉన్న ఉద్యోగులు బ్యాండ్ మేళంతో పారిని ఆహ్వానిస్తారు. అక్కడ తను ప్రేమిస్తున్న అమ్మాయి ఉండటంతో, పారి కూడా కలెక్టర్ లా బిల్డ్ అప్ ఇస్తాడు.
మరోవైపు గ్రామస్తులు వైన్ షాప్ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కి దిగుతారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. పక్క ఊరిలో ఉన్న తగుబోతులు కూడా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వస్తారు. తహసీల్దార్ వచ్చి పరిస్థితి తెలుసుకుని గొడవ జరగకుండా చూస్తాడు. ఒక వారంలో వైన్ షాప్ తీసుకొస్తానని మాట ఇస్తాడు. ఇక అందరూ ప్రస్తుతానికి అక్కడినుంచి వెళ్లిపోతరు. చివరికి అ గ్రామానికి వైన్ షాప్ వస్తుందా ? పారి లవ్ స్టోరీ సక్సెస్ అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ కామెడీ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఫైట్లూ లేవు, లవ్వూ లేదు… ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్