Chris Gayle : వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాను క్రీజులో ఉంటే పరుగుల వరద పారాల్సిందే. తాను ఉన్నంత సేపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడంలో గేల్ ముందు వరుసలో ఉంటాడు. ఆ తరువాత డివీలియర్స్ ఉంటాడు. ఇక ఐపీఎల్ లో అయినా.. టీ20లలో అయినా గేల్ తమదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ అయినప్పటికీ గేల్ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Shubman Gill : టెస్ట్ కెప్టెన్ గా గిల్.. అంతలోపే పొగరు చూపించాడు.. ఆ లేడీ ని అవమానించి!
క్రిస్ గేల్ ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. ఐపీఎల్ లో గేల్ 175 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే దాని వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ దాగి ఉంది. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదేంటంటే..? 2013లో బెంగళూరు వర్సెస్ పూణే వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 175 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ బంతిని గట్టిగా కొట్టడంతో ఆ బాల్ క్రౌడ్ లో ఉన్న ఒక చిన్న పాప కి గట్టిగా తగిలింది. వెంటనే ఆ పాపని ఎమర్జెన్సీ లకి షిప్ట్ చేశారు. మ్యాచ్ తరువాత గేల్ నా బ్యాటింగ్ వల్ల ఒక ఫ్యాన్ కి ఇంజూర్ అయ్యారని బాధ పడ్డాడు. మ్యాచ్ అయిపోగానే గేల్ ఆ హాస్పిటల్ కి వెళ్లాడు. అప్పుడు ఆ పాప నాకు ఏం కాలేదు. కానీ ఫుల్ మ్యాచ్ చూడలేక పోయాను అని అన్నది. తరువాత గేల్ హాస్పిటల్ బిల్ మొత్తం పే చేశాడు. ఆ పాపని తరువాత మ్యాచ్ కి గెస్ట్ గా తీసుకొచ్చాడు గేల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మేనేజ్ మెంట్ కూడా ఆ పాప కి స్పెషల్ గెస్ట్ గా ట్రీట్ చేశారు. ఆ సమయంలో గేల్ తన అభిమానికి అంత రెస్పెక్ట్ ఇచ్చాడు మరీ. ఆ రోజు మ్యాచ్ లో గేల్ బ్యాటింగ్ చేసినట్టే.. ఒక అభిమాని ఆ బాల్ ని నా ఫేస్ మద కొట్టు అని రాసుకొని వచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని ట్రోలింగ్స్ చేస్తున్నారు.
గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున పలు రికార్డులను నమోదు చేశాడు. అత్యదిక స్కోర్, అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. గేల్ ఆర్సీబీ తరుపున అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఒక్కసారి కూడా కప్ రాలేదు. కానీ మూడు సార్లు ఫైనల్ కి వెల్లింది. రెండు సార్లు హైదరాబాద్ పై, ఒకసారి చెన్నై పై ఓడి ఇంటికి వచ్చేసింది. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ఫామ్ కనబరుస్తోంది. ఈ సీజన్ లో దాదాపు కప్ ఆర్సీబీదేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపించడం విశేషం.