OTT Movie : ఆశ్విన్ అనే యువకుడి లవ్ స్టోరీ బ్రేక్ అప్ అవుతుంది. అతని ఎమోషనల్ బ్లైండ్‌నెస్ వల్ల ప్రియురాలు అతన్ని వదిలేస్తుంది. ఇతను తన ప్రేమ కథను సినిమాగా మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ స్టోరీ నడుస్తుంది. IMDbలో ఈ సినిమాకి 8.7/10 రేటింగ్ కూడా ఉంది. ఆమిర్ ఖాన్ స్పెషల్ స్క్రీనింగ్‌లో “ఈ స్టోరీ యంగ్ బాయ్స్ అందరూ చూడాలి, ఇటువంటి లవ్ స్టోరీ నేను చూడలేదు” అని పొగిడారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలోనే నడుస్తోంది. తొందర్లోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ ఫ్లిక్స్ లో
ఈ తమిళ కామెడీ డ్రామా మూవీ పేరు ‘Oho Enthan Baby’. 2025 లో వచ్చిన ఈ సినిమాకి కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రుద్ర, మిథిలా పాల్కర్, విష్ణు విశాల్, అంజు కురియన్, మైస్కిన్, రెడిన్ కింగ్స్లీ, కరుణాకరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. విష్ణు విశాల్, రాహుల్ నిర్మించిన ఈ చిత్రం 2025 జులై 11న థియేటర్లలో రిలీజ్ అయింది. 134 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా తొందర్లోనే Netflixలో స్ట్రీమింగ్ కు రానుంది.
Read Also : ఎక్కడా చూడని దరిద్రం… వీడేం ముట్టుకున్నా మటాష్… చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్
ఆశ్విన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్. తన కెరీర్‌లో బ్రేక్ కోసం నటుడు విష్ణు విశాల్ కి స్టోరీ చెప్పడానికి వెళ్తాడు. విష్ణు మొదటి రెండు స్టోరీలను రిజెక్ట్ చేసి, ఒక లవ్ స్టోరీ చెప్పమని అడుగుతాడు. ఎందుకంటే అతను తన కెరీర్‌లో లవ్ స్టోరీ చేయలేదు. ఆశ్విన్ తన సొంత లవ్ స్టోరీని చెప్పడం మొదలుపెడతాడు. ఆశ్విన్ జీవితంలో మూడు ఫేజ్‌లలో (చైల్డ్‌హుడ్, కాలేజ్, మీరాతో లవ్ స్టోరీ) ఈ స్టోరీ నడుస్తుంది.
చైల్డ్‌హుడ్ ఫేజ్: ఆశ్విన్ డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీలో పెరుగుతాడు. తల్లిదండ్రుల మధ్య గొడవలతో, ఇంట్లో ఎప్పుడూ టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఈ ఫేజ్‌లో అతని మొదటి లవ్ స్టోరీ, చిన్నప్పటి క్రష్, ఫెయిల్ అవుతుంది.
కాలేజ్ ఫేజ్: ఆశ్విన్ కాలేజ్‌లో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె లెస్బియన్ అని, అతని ఫ్రెండ్‌ని లవ్ చేస్తోందని తెలుస్తుంది. ఈ “హార్ట్‌బ్రేక్” అతన్ని ఒంటరిగా మారుస్తుంది.
మీరాతో లవ్ స్టోరీ: ఆశ్విన్ ఒక డాక్టర్ అయిన మీరాని కలుస్తాడు. మొదటి కలయికలోనే స్పార్క్ ఫీలవుతాడు. మీరా అతని ఫిల్మ్‌మేకింగ్ ప్యాషన్‌ని సపోర్ట్ చేస్తుంది. మొదటి కిస్ ఇనిషియేట్ చేస్తుంది. కానీ ఆశ్విన్ డిస్‌ఫంక్షనల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల టాక్సిక్ ట్రైట్స్ (ఈగో, ఎమోషనల్ అన్‌అవేర్‌నెస్) కలిగి ఉంటాడు. మీరాకి కూడా తన ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫ్రిక్షన్ వల్ల వాళ్లు బ్రేకప్ చేసుకుంటారు. ఇంటర్వెల్‌లో ఈ బ్రేకప్ ఒక క్లైమాక్స్‌గా ముగుస్తుంది.
ఆశ్విన్ తన బాధను స్క్రిప్ట్‌లో చూపిస్తాడు. విష్ణు విశాల్‌కి పిచ్ చేస్తూ, “ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ లేదు” అని చెప్తాడు. విష్ణు అతన్ని మీరాని కలవమని, స్టోరీని కంప్లీట్ చేయమని పుష్ చేస్తాడు. సెకండ్ హాఫ్‌లో ఆశ్విన్ తన ఈగో, టాక్సిక్ ట్రైట్స్‌ని పక్కన పెట్టి, మీరాతో రియూనైట్ అవ్వాలని ట్రై చేస్తాడు. క్లైమాక్స్‌లో ఆశ్విన్ తన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకుని, మీరాతో రియూనైట్ అవుతాడా ? లేక తన కెరీర్ కే ప్రాధాన్యం ఇస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.