Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన రేవతి, జగదీష్‌లను అపర్ణ తిడుతుంది. దీంతో ఏం అంటున్నారు అత్తయ్య మీరు ఇంటికి వచ్చిన వాళ్లను ఎవరో అనుకుని తిడుతున్నారేమో తన పేరు రేవతి.. ఆ రోజు నన్ను మా అక్కను కాపాడింది అని చెప్పానే ఈవిడే అని కావ్య చెప్పగానే.. ప్రాణాలు కాపాడిందో.. కాపాడుతున్నట్టు నటించి తిరిగి ఇంటికి రావడానికి ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసు.. అంటుంది అపర్ణ. దీంతో రేవతి అమ్మా అని పిలవగానే కోపంగా నోర్మూయ్.. అలా పిలిచే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు.. ఆరోజే చెప్పాను. నువ్వు తిరిగి ఇంట్లో అడుగుపెట్టడం జరిగితే అది నా చావుతోనే అని ఏంటి..? చూస్తున్నావు.. నేను చచ్చానని ఇంట్లో అడుగుపెట్టావా..? అంటుంది.
ఇంతలో కావ్య కలగజేసుకుని అత్తయ్యా ఒక్క నిమిషం.. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. రేవతి గారు మీ కూతురు అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను మీ కోడలు అన్న విషయం ఇప్పటి వరకు తనకు తెలియదు. అందుకేనేమో పిలిచాను అత్తయ్యా నా మాట కాదనలేక రేవతి గారు ఇక్కడికి వచ్చారు.. అని కావ్య చెప్పగానే.. స్వప్న కూడా అవును ఆంటీ.. నా చెల్లెలు చెప్పేది నిజం ఆరోజు మేము ప్రమాదంలో ఉంటే మేము ఎవరో కూడా తెలియకుండా రేవతి గారే మమ్మల్ని కాపాడారు.. అలాంటి మనిషిని ఇలా అవమానించడం కరెక్టు కాదనిపిస్తుంది అని చెప్పగానే.. కావ్య కూడా అవును అత్తయ్యా ఒకసారి మీరే ఆలోచించండి.. ఎప్పుడో ఏదో గొడవ జరిగిందని ఆ గొడవను మనసులో పెట్టుకుని ఇప్పుడు అవమానించడం ఏంటి..? ఒకవేళ మీరు చెప్పినట్టు తను మీ కూతురే అయితే తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇదే మంచిరోజు అనుకుని తనని క్షమించేయోచ్చు కదా అని చెప్తుంది.
దీంతో రుద్రాణి చాలా బాగుంది.. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట.. ఇన్ని రోజులుగా మా వదిన కూతురు చూసిన మోసాన్ని, అవమానాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ తనలో తాను బాధపడుతుంటే.. మళ్లీ నువ్వు ఈరోజు అవన్నీ గుర్తు చేయడానికి తీసుకొచ్చావా..? అసలు ఆ రోజు ఈ రేవతి ఏం చేసిందో నీకు తెలుసా..? కట్టుకున్న మొగుడి కోసం కన్న తల్లిదండ్రులను అవమానించంది. పుట్టింటితో బంధమే అవసరం లేదని మాట్లాడింది. బంధాలకు విలువ ఇవ్వని నాకే ఆ రోజు కడుపు మండిపోయింది అంట చెప్తుంది. కావ్య కోపంగా రుద్రాణి గారు ఇది ఒక తల్లికి బిడ్డకు మధ్య జరుగుతుంది. మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది అంటుంది. అయితే నువ్వెందుకు చేసుకుంటున్నావు.. నీకు ఏం సంబంధం ఉందని ఆవిడను ఇక్కడకు తీసుకొచ్చావు అని ప్రశ్నించగానే.. మీకొక్కసారి చెబితే అర్థం కాదా..? రేవతి గారు అత్తయ్య కూతురు అన్న విషయమే నాకు తెలియదు. పొరపాటున తీసుకొచ్చాను అని చెప్తున్నాను కదా..? అనగానే..
సరే నీకు తెలియదు సరే రేవతి మా వదిన కూతురు అన్న విషయం రేవతికి తెలుసు కదా..? నువ్వు తెలియకనే మా వదినతో ఫోన్‌లో మాట్లాడించి రేవతిని పిలిపించావు అనుకుందాం కానీ రేవతికి తెలుసు కదా..? ఫోన్‌లో మాట్లాడుతున్నది కన్న తల్లి అని అప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు.. ఆ విషయాన్ని దాచిపెట్టి మొగుణ్ని తీసుకుని వచ్చింది అంటే ఇదంతా తన ప్లాన్‌లో భాగం అని అర్థం చేసుకోలేమా..? అంటూ ప్రశ్నించడంతో రేవతి ఏడుస్తుంది. ఇంతలో రాజ కోపంగా ఆంటీ మీ మాటల వింటుంటే ఏదో ఒక వంకతో వాళ్లిద్దరిని విడగొట్టాలని చూస్తున్నట్టు ఉంది. వాళ్లు విడిపోవడం మీకు అంత ఇష్టమా..? అని అడుగుతాడుఉ. దీంతో రుద్రాణి .. నాకు అలాంటి ఉద్దేశం ఎందుకు ఉంటుంది. నాకు అలాంటి ఆలోచన ఏం లేదు అని చెప్తుంది.
దీంతో ఇంద్రాదేవి కోపంగా లేకపోతే ఈ చెత్త వాగుడు అంతా ఎందుకు వాగుతున్నావు.. అపర్ణ మనసును ఇంకా ఎందుకు పాడు చేస్తున్నావు.. అంటూ తిట్టగానే.. నేనేం మాట్లాడలేదు అమ్మా అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంద్రాదేవి తిట్టి అపర్ణ దగ్గరకు వెళ్లి కన్వీన్స్ చేయాలని చూస్తుంది. కావ్య కూడా కన్వీన్స్ చేయాలని చూస్తుంది. దీంతో అపర్ణ కోపంగా కావ్యను కూడా తిడుతుంది. రేవతిని ఎప్పటికీ క్షమించను.. నువ్వు నా కళ్ల ముందు ఉన్నంత సేపు నువ్వు చేసిన అవమానమే నాకు గుర్తుకు వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తిట్టగానే.. జగదీష్, రేవతిని తీసుకుని వెళ్లిపోతాడు. అందరూ బాధపడుతుంటారు.
తర్వాత అపర్ణ రూంలో కూర్చుని రేవతి ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. సుభాష్ వచ్చి నాకో నిజం చెప్పు మన కూతురు మీద నీకు ప్రేమ నిజంగా లేదా..? అని అడుగుతాడు. అపర్ణ ఏడుస్తూనే దాని మీద ప్రేమ చావదు.. అలాగే అది చేసిన ద్రోహం మర్చిపోలేను అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు ఇంద్రాదేవి కోపంగా రాజ్, కావ్యలను తిడుతుంది. నేను ఇన్ని రోజులు చేసిన కష్టం వృథా అయిపోయింది. అసలు మిమ్మల్ని ఇలా ఎవరు చేయమన్నారు అంటుంది. రేవతి కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?