OTT Movie : సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చే ఒక తెలుగు సినిమా, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. IMDbలో 8.6/10 రేటింగ్‌తో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ ని తలపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘బ్రహ్మవరం P.S. పరిధిలో’ (Brahmavaram PS Paridhilo) 2024లో విడుదలైన తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇది ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందింది. డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్, హర్షిని కోడూరు, రూప లక్ష్మీ, సమ్మెట గాంధీ, జీవా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 23, 2024న థియేటర్లలో విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం థియేటర్ విడుదలైన ఏడాది తర్వాత, 2025 ఆగస్టు 23 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళ్తే
బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ సమీపంలో తల లేని శవం కనిపిస్తుంది. ఈ సీన్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ శవం ఎవరిది ? హంతకుడు ఎవరు ? ఆ స్థలంలో ఎందుకు వదిలారు ? అనే ప్రశ్నలతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తారు. పోలీసులు మృతదేహం గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. కానీ ప్రతి అడుగులో కొత్త రహస్యాలు బయటపడతాయి. కొన్ని ఆధారాలు ఊహించని మలుపులకు దారితీస్తాయి. ఇవి కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
ఇప్పుడు స్టోరీ మూడు నెలలు వెనక్కి వెళ్తుంది. చైత్ర అనే యువతి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమెరికా నుండి బ్రహ్మవరంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. ఈమె సూర్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఈ స్టోరీకి ఈక్వల్ గా గౌతమ్ అనే యువకుడి స్టోరీ కూడా నడుస్తుంది. గౌతమ్ జులాయిగా తిరిగే ఒక యువకుడు. గౌతమ్ జీవితంలో కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉంటాయి. ఇవి అనుకోకుండా ఒక హత్యకు దారితీస్తాయి. ఇది తల లేని శవానికి కనెక్ట్ అవుతుంది.
ఈ హత్య కేసును రామ్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, గౌతమ్ గత జీవితం, చైత్ర, సూర్య లవ్ స్టోరీలతో ఈ హత్య వెనుక ఉన్న అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఈ కథలో ఒక తప్పు ఎలా న్యాయానికి దారితీస్తుందనే ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఇక ఈ క్లైమాక్స్ షాక్ అయ్యే ట్విస్టులతో ముగుస్తుంది. ఈ ట్విస్టులు ఏమిటి ? హత్య ఎవరు చేసారు ? ఎందుకు చేశారు ? పోలీసులు వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్