E-Paper
Advertisement

OTT Alert : ఈ రోజు ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు, ఒక సిరీస్… ఏది ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Alert : ఈ రోజు ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు, ఒక సిరీస్… ఏది ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

OTT Alert : ఈ రోజు అంటే ఫిబ్రవరి 11న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మూడు మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు విడుదల అయ్యాయి. అందులో రెండు సంక్రాంతి హిట్ సినిమాలు ఇప్పుడు డిజిటల్‌ గా రిలీజ్ అయ్యాయి. అలాగే ఒక పంజాబీ సూపర్‌ హిట్ సిరీస్ సీజన్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. ఏది ఎక్కడ చూడొచ్చో, వాటి కథ ఏంటో వివరంగా చూద్దాం.

1. మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankar Vara Prasad Garu)

సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో భారీ హిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఇప్పుడు ZEE5లో అందుబాటులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్-కామెడీలో చిరంజీవి తన రోల్ తో అభిమానులను అలరించారు. నయనతారతో కెమిస్ట్రీ, వెంకటేష్ అతిథి పాత్రలో వచ్చిన సన్నివేశాలు అదిరిపోయాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్, హాస్యం అన్నీ ఉండడంతో మెగా అభిమానులకు ఈ సినిమా స్పెషల్ గా మారింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్. ఒకవేళ థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో ఒక లుక్కేయండి.

2. అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)

Advertisement

ఈ సంక్రాంతి సమయంలో థియేటర్లలోకి వచ్చిన బెస్ట్ సినిమాలలో ‘అనగనగా ఒక రాజు’ కూడా ఒకటి. ఈ మూవీ పాజిటివ్ బజ్ తో మంచి విజయం సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలు, సామాజిక సందేశాలు, సరదా హాస్యం వంటి అంశాలతో ఈ మూవీ కూడా ఫ్యామిలీ కలిసి చూడడానికి పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లైట్-హార్టెడ్ వినోదం కావాలంటే ఇది బెస్ట్ ఛాయిస్.

Read Also : టైమ్ లూప్ లో ఇరుక్కుపోయే కిల్లర్… అమ్మాయిలతో అదే పని… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

3. కోహ్రా సీజన్ 2 (Kohrra : Season 2)

Advertisement

పంజాబీ సూపర్‌ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘కోహ్రా సీజన్ 2’. ఇప్పుడు Netflixలో ప్రీమియర్ అవుతోంది. సీజన్ 1లో మర్డర్ మిస్టరీ, డ్రగ్స్ సమస్యలు, పంజాబ్ గ్రామీణ జీవితం వంటి అంశాలు భారీగా ఆకట్టుకున్నాయి. సీజన్ 2లో కూడా అదే టీమ్… బరున్ సోబ్తి, వివేక్ చౌధరి కొత్త కేస్‌తో తిరిగి వస్తున్నారు. ఈసారి సిరీస్ లో మరిన్ని ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఉంటాయి. ఇప్పటికే సీజన్ 1 చూసినవారు ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులకు నేడు ఫుల్ స్టాప్ పడింది. ఈ రోజు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 3 సినిమాలలో ఫ్యామిలీతో సరదాగా చూడాలంటే ‘మన శంకర వర ప్రసాద్ గారు’, లేదా అనగనగ ఒక రాజు చూడవచ్చు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడితే ‘కోహ్రా సీజన్ 2’ బెస్ట్ ఛాయిస్.

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×