E-Paper
Advertisement

OTT Bold Movie : బెడ్రూంలో సీక్రెట్ కెమెరాలు… పెళ్ళానికి నరకం ఎలా ఉంటుందో చూపించే సైకో

OTT Bold Movie : బెడ్రూంలో సీక్రెట్ కెమెరాలు… పెళ్ళానికి నరకం ఎలా ఉంటుందో చూపించే సైకో

OTT Bold Movie : ఏడు జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకునే అద్భుతమైన బంధం భార్యాభర్తలది. అయితే కొంతమంది భర్తలు ఫ్యామిలీని ఏ కష్టం రాకుండా చూసుకోవడమే కాకుండా భర్త అంటే ఇలా ఉండాలి అనిపించుకుంటారు. కానీ మరికొంత మంది మాత్రం బ్రతికుండగానే భార్యలను వేయించుకుని తింటూ, తమ వేధింపులతో నరకం చూపిస్తారు. ఇలాంటి వార్తలను ఇప్పటిదాకా ఎన్నో చూసాం విన్నాం మనం. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఈ సైకో ఏకంగా బెడ్ రూంలోనే కెమెరాలు పెట్టి గమనిస్తూ ఉంటాడు. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఈ సైకో సస్పెన్స్ థ్రిల్లర్ పేరేంటి ? అనే విషయాలపై ఒక లుక్ వేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

సస్పెన్స్ సినిమాలకు ఓటిటిలో మంచి ఆదరణ ఉంటుంది. స్టోరీ బాగుంటే అతి తక్కువ టైమ్ లోనే ఆ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తాయి. ఇక తెలుగులోనూ ఇలాంటి సినిమాలకు కొదవలేదని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో తెలుగు హీరోయిన్ ఈష రెబ్బ హీరోయిన్ గా, సత్యదేవ్ హీరోగా నటించారు. ఇందులో గణేష్ వెంకట్రామన్, శ్రీరామ్, ముస్కాన్ సేతి, కృష్ణ భగవాన్, రవివర్మ, అదిరే అభి, టెంపర్ వంశీ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే…

రాహుల్ ఇండియాలోనే ఒక నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్. అతను అప్ కమింగ్ మోడల్స్ తో ఫోటో షూట్ లు చేయడంలో ఆరితేరినవాడు. రాహుల్ ఎంత పాపులర్ అంటే ఏ మోడల్ అయినా సరే అతనితో ఫోటో షూట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. నెంబర్ వన్ మోడల్ గా కొనసాగాల్సిందే. అంతటి పేరు, ఫేమ్ ఉన్న ఈ హీరో ఓ మోడల్ ఫోటోషూట్ ని షెడ్యూల్ చేస్తాడు. ఫోటోషూట్ కోసం ఆ అమ్మాయి వచ్చాక ఊహించని విధంగా ప్రవర్తించడంతో సినిమా మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఫోటోషూట్ కోసం ఏకంగా బట్టలు తీసేయమని ఆర్డర్ వేస్తాడు. ఈ ఊహించని పరిణామానికి ఆమె నివ్వెరపోవడమే కాకుండా అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ హీరో అనుకోకుండా ఆమెను చంపేస్తాడు. ఆ తర్వాత ఈ ఫోటోగ్రాఫర్ విద్య అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ పెళ్లయ్యాక అతను దారుణంగా ప్రవర్తిస్తాడు. ఏకంగా బెడ్రూం లో కెమెరాలు పెట్టి చూస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం హీరొయిన్ కి తెలియదు. ఇక ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగానే ఓ రోజు రాహుల్ హత్యకు గురవుతాడు. కానీ పోలీస్ ఇన్విస్టిగేషన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్ గణేష్ తన కోసమే అతన్ని చంపేసి ఉంటాడని నమ్మి, ఆ నేరం తానే చేసానని ఒప్పుకుంటుంది. కానీ గణేష్ కి అసలు ఈ విషయంలో సంబంధం ఉండదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్య ఏం చేసింది? అసలు రాహుల్ ని చంపింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ‘రాగల 24 గంటల్లో’ అనే ఈ సస్పెన్స్ సినిమాను చూడాల్సిందే.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×