OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇదివరకు చాలా వచ్చినా, ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా తో పాటు సస్పెన్స్ ని జోడించి ఒక మంచి ఎంటర్టైన్ మూవీ గా చిత్రీకరించాడు దర్శకుడు. ఈ మూవీ పేరేమిటి?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “అమ్ము” (Ammu). ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్, ఎందుకు ఆమెను టార్చర్ చేస్తుంటాడో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ మూవీ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రవి పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉంటాడు. తన ఇంటి పక్కనే ఉన్న అమ్ము అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరి సంసారం చాలా రోజులు హ్యాపీగానే నడిచిపోతుంది. ఉన్నట్టుండి రవి అమ్ముని వేధించడం మొదలు పెడతాడు. రవి ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక అమ్ము చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు లంచ్ బాక్స్ మర్చిపోవడంతో ఆమెను గట్టిగా కొడతాడు. మరొకసారి ఆఫీస్ ఫైల్ ఆమె వల్ల కాలిపోవడంతో తీవ్రంగా కొడతాడు. వీళ్ళ ఇంటికి వచ్చిన పేరెంట్స్ తో తన బాధను చెప్పుకొని, పెళ్లి చేసుకుని తప్పు చేశానని బాధపడుతుంది. అలా చెప్తుంటే చాటుగా విన్న రవి అమ్ముపై మరింత కోప్పడతాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రభు అనే ఖైది పెరోల్ తీసుకుని బయటికి వస్తాడు. పోలీస్ స్టేషన్లో ప్రభు రోజు సంతకం పెట్టి రావాలి. ఒకరోజు రవితో ప్రభు గొడవపడతాడు. ప్రభుకి పెరోల్ రద్దుచేసి అతనిని స్టేషన్ లోనే ఉంచుతాడు రవి. అమ్ము రవి పై కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వస్తుంది. అక్కడున్న ప్రభుతో మాట్లాడాక తన భర్తకు బుద్ధి చెప్పాలని అతని సాయం తీసుకుంటుంది. అతడు అక్కడి నుంచి పారిపోవడానికి సహాయం చేస్తుంది.
ఈలోగా కమిషనర్ రవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతనిని పట్టుకోకపోతే అందరిని సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. రవి సీసీ కెమెరాలను వెతుకుతుండగా, తన ఇంట్లోనే రవి ఉన్నట్టు గుర్తిస్తాడు. తన భార్య ప్రభుకి సాయం చేసిందని తెలుసుకుంటాడు. ఇంటికి వచ్చిన రవి భార్యపై కోపంతో నిన్ను చంపుతాను అని అంటాడు. అయితే రవి భార్య ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అయినా చంపుతావా అని అంటుంది. నిన్ను చంపి నేను మళ్లీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాను అంటూ ఆమెను చంపడానికి మీదకి వస్తాడు. ఇదంతా అమ్ము రికార్డ్ చేసి ప్రభుకి పంపిస్తుంది. ప్రభు ఆ వీడియోని కమిషనర్ కి పంపిస్తాడు. చివరికి రవి చేతిలో అమ్ము ఏమవుతుంది? అతని ఉద్యోగం ఊడుతుందా? ఎందుకు రవి అలా ప్రవర్తిస్తున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “అమ్ము” (Ammu) మూవీని తప్పకుండా చూడండి.