OTT Movie : హాలీవుడ్ సినిమాలు లేకుండా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ని ఊహించుకోలేం. హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “బెటర్ వాచ్ అవుట్” (Better watch out). ఈ మూవీ లో హీరోయిన్ బేబీ సిట్టర్ గా పని చేస్తూ ఆ ఇంట్లో ఆమె ఎదుర్కునే సంఘటనలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
12 సంవత్సరాల లూక్ అనే అబ్బాయికి బేబీ సిట్టర్ గా పనిచేయటానికి 16 సంవత్సరాల యాస్లీ అనే అమ్మాయి వస్తుంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఆ అబ్బాయి తండ్రి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అవేమీ ఆమె పట్టించుకోదు. ఆమెకు సిటీలో జాబ్ దొరకడంతో చివరిగా ఆ ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి వస్తుంది. అప్పుడే పేరెంట్స్ ఒక పని మీద బయటకు వెళ్లిపోతారు. అయితే ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. చిన్నపిల్లాడు కావడంతో ఆ అమ్మాయి అతనిని పట్టించుకోదు. అయితే నేను చిన్న పిల్లాడు కాదు అని మందు కూడా తాగుతాడు. ఆమె ఆ బాటిల్ ని తీసి పక్కకు పడేస్తుంది. నీకు ఏజ్ ఎక్కువగా ఉంటే నేను నీతో డేట్ కి వచ్చే దాన్ని, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అంటూ చెప్పుకొస్తుంది. ఇంతలో యాస్లీ తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడటం లూక్ కు నచ్చదు. ఇంతలో ఇంటి బయటనుంచి ఏవేవో చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి.
ఎవరో వీళ్లను భయపెట్టిస్తూ ఉంటారు. చివరికి ఆ భయపెడుతున్న వ్యక్తి లూక్ ఫ్రెండే అని యాస్లీ గ్రహిస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారని గట్టిగా నిలదీస్తుండగా ఆమెను ఆ కుర్రాడు గట్టిగా కొడతాడు. ఆమెను కుర్చీకి కట్టేసి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అక్కడ భయపెడుతున్న వ్యక్తి మరెవరో కాదు లూక్ ఫ్రెండ్. యాస్లీని భయపెట్టి ఆమెను కాపాడుతున్నట్టు నటించడంతో ఇంప్రెస్ అవుతుందనుకొని లూక్ ఇలా చేస్తాడు. అయితే ఆ ఇంటికి అప్పటికే ఆమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అతడిని కూడా రాడ్ తో కొట్టి ఇద్దరూ కట్టేస్తారు. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ని కూడా పిలిచి అదే పని చేస్తారు. ఆ కుర్రాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? చివరికి ఆ ఇంట్లో నుంచి వీళ్ళందరూ బయట పడ్డారా? లూక్ వీళ్లను ఏ విధంగా చిత్రహింసలు పెట్టాడు. అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “బెటర్ వాచ్ అవుట్” (Better watch out) మూవీని తప్పకుండా చూడండి.