OTT Movie : కొన్ని సినిమాలు మాటలలో వర్ణించలేని విధంగా ఉంటాయి. ఆ సినిమాలు ఓక మంచి మెసేజ్ కూడా ఇస్తాయి. గుండెల్ని పిండేసే ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. చిన్న సినిమానే అయినా ఈ మూవీ సంచలనాలు సృష్టించింది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ఆణిముత్యం ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మలయాళం మూవీ పేరు “బిర్యాని” (Biryani) ఒక నిరుపేద ముస్లిం అమ్మాయిని భర్తతో పాటు, ఊరి జనం వెలివేయడంతో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల చుట్టూ స్టోరీ నడుస్తుంది. గుండెల్ని పిండే ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కడేజా అనే ఒక ముస్లిం అమ్మాయికి వివాహం జరిపించి అత్తగారింటికి పంపిస్తారు. అత్తగారింటికి వచ్చాక భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోడు. కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఆమెను ఒక కోరికలు తీర్చే మిషన్ గానే చూస్తాడు. ఆమె అత్త కూడా ఆమెను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తుంది. ఇంతలో కడేజా తండ్రి చాపలు పడుతూ చనిపోయాడని వార్త వస్తుంది. సొంత ఊరికి వెళ్లిన కడేజా తన తండ్రి అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయలేక పోతుంది. ఊరిలో తండ్రి ఫంక్షన్ చేయడానికి పైసలు లేకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆమె తమ్ముడు ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడని పోలీసులు ఆమెను విచారణకు స్టేషన్ కు తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఊరి పెద్దలు వీళ్లను ఊరి నుండి బహిష్కరిస్తారు. తండ్రి చావుతో తల్లి మతిస్థిమితం కోల్పోతుంది. ఇంతలో కడేజా భర్త ఆమె తమ్ముడి గురించి తెలుసుకొని ఫోన్ లోనే తలాక్ చెప్పేస్తాడు.
ఆ తరువాత కడేజా తమిళనాడులోని ఒక మసీదుకి వెళ్తుంది. డబ్బులు లేకపోవడంతో అక్కడ తప్పని పరిస్థితుల్లో వ్యభిచారం చేయాల్సి వస్తుంది. అయితే ఇంతలో ఈమె తమ్ముడు చనిపోయాడనే ఒక వార్త అందుతుంది. వీళ్లకు అంత్యక్రియలు చేయాలని కడేజా మళ్లీ ఆ ఊరికి వస్తుంది. అప్పటికే ఆమె గర్భవతిగా ఉంటుంది. పోలీసులు ఆమెను బలవంతం చేస్తూ ఆ పనికి ఒప్పుకోమని కొట్టడంతో, కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చే స్తుంది. ఆ పిండాన్ని తీసుకొని బాధపడుతూ ఊరికి వెళుతుంది. ఊరిలో కొంతమంది పెద్దమనుషులను పిలిచి, ఆ పిండాన్ని బిర్యాని చేసి వాళ్ళకు పెడుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు మూవీలో చూస్తేనే బెటర్. ఇంతకీ ఆమె కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు ఎందుకు అలా చేస్తుంది? ఊరి పెద్దలు ఆమెను మళ్లీ ఊరికి ఆహ్వానిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “బిర్యాని” (Biryani) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ అవార్డు విన్నింగ్ మూవీ అయినప్పటికీ ఫ్యామిలీతో చూసే విధంగా ఉండదు. ఈ మూవీని ఒంటరిగా చూడడమే బెటర్.