E-Paper
Advertisement

OTT Movie : లోన్ పేరుతో మోసం… మాఫియాకే చెమటలు పట్టించే ఒంటరి అమ్మాయి క్రేజీ కొరియన్ కథ

OTT Movie : లోన్ పేరుతో మోసం… మాఫియాకే చెమటలు పట్టించే ఒంటరి అమ్మాయి క్రేజీ కొరియన్ కథ
Advertisement

OTT Movie : కొరియన్ సినిమాలకు మన దగ్గర ఎంత క్రేజ్ ఉందో సెపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏకంగా ఇలాంటి సినిమాలను చూసి కొరియన్ లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నారు కొంతమంది. అంతేకాదు కొరియన్ ట్రెండ్ ను కూడా ఫాలో అవుతూ వాళ్ళ అవుట్ ఫిట్ తో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. ఇక మరి కొంతమందికైతే ఈ కొరియన్ సినిమాలు, సిరీస్ లు అంటే ఎంత పిచ్చి అంటే ఎంత టైం అయినా సరే పూర్తయ్యేంత వరకు చూడడం ఆపరు. అలా కొరియన్ సినిమాలు పిచ్చిపిచ్చిగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఒక క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా. మరి ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

Advertisement

ఇప్పుడు మనం ప్రస్తావించబోతున్న సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిందని అంటారు. అంతేకాకుండా కొరియన్ భాషలో ఇప్పటిదాకా వచ్చిన థ్రిల్లర్ సినిమాలలో ఇది కూడా ఒక బెస్ట్ మూవీ. ఓ అమ్మాయి తనను మోసం చేసిన మాఫియాకి ఎలా చెమటలు పట్టించింది అన్నదే స్టోరీ.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమాలో హీరోయిన్ ఇద్దరు పిల్లల తల్లి. అయితే ఒంటరిగా పిల్లల్ని చూసుకునే ఈ తల్లి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. దానికి డబ్బు కావాలి కాబట్టి లోన్ కోసం ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే లోన్ పేరుతో ఒక కాల్ రాగా, లోన్ రావాలంటే ఫీజులు కట్టాలి అంటూ హీరోయిన్ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇక హీరోయిన్ కూడా లోన్ వస్తుందన్న ఆశతో అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇలా డబ్బు కట్టికట్టి విసిగిపోయిన హీరోయిన్ ఓ రోజు వెళ్లి డైరెక్ట్ గా బ్యాంక్ లో కనుక్కుంటే అసలు విషయం అర్థం అవుతుంది. తను ఇప్పటిదాకా డబ్బులు కట్టింది బ్యాంకు వాళ్లకు కాదన్న విషయం తెలుస్తుంది. పైగా ఈ మోసం వెనక ఓ మాఫియా ఉందని తెలిసి షాక్ అవుతుంది హీరోయిన్. కానీ లోన్ వస్తుందని ఆశతో తన దగ్గర ఉన్న డబ్బును అంతా అప్పటికే వాళ్ళకి కట్టేస్తుంది. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో పిల్లలను ఆశ్రమానికి పంపించి, ఆ మాఫియా పని పట్టే పనిని మొదలు పెడుతుంది. వాళ్లను బయటకు రాగాలని ఫిక్స్ అయిన హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఓ లీడ్ దొరకడంతో డైరెక్ట్ గా చైనాకు వెళ్ళిపోతుంది. అయితే అక్కడ హీరోయిన్ కి మరో ఇద్దరు మహిళలు సహాయం చేస్తారు. కానీ ఆమె చేస్తున్న ఈ పని హీరోయిన్ ను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మరి హీరోయిన్ ఎదుర్కొన్న ఆ ప్రమాదాలు ఏంటి? అనుకున్నట్టుగా ఆమె మాఫియా గుట్టు రట్టు చేయగలిగిందా? ఆమె తనకు జరిగిన అన్యాయానికి ఎలా పగ తీర్చుకుంది? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ‘సిటిజెన్ ఆఫ్ కైండ్‘ అనే ఈ సినిమాపై ఒక లుక్ ఎయ్యండి.

Related News

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×