BigTV English

DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

DKZ technologies fraud: హైదరాబాద్ సిటీలో చిన్న చిన్న ఫైనాన్స్ సంస్థలు ఇబ్బందిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. రిటర్న్స్ ఎక్కువగా ఇస్తామంటూ మోసం చేస్తున్నాయి. చివరకు మోసపోయామని భావించి లబోదిబోమంటున్నారు బాధితులు.


అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చేటు చేసుకుంది. డీకెజెడ్ టెక్నాలజీస్-డికాజో సొల్యూషన్స్ ఉమ్మడి ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టాయి. మీరు ఎంత పెట్టుబడి పెడితే.. అంతే ఇస్తామని చెప్పడంతో ప్రజలు కనెక్ట్ అయ్యారు.

రెండేళ్లలో పెట్టిన పెట్టుబడికి వంద శాతం చొప్పున లాభాలు ఇస్తామని నమ్మించింది. చాదర్ ఘాట్, టోలిచౌక్‌లో స్టోర్లను సైతం ఏర్పాటు చేసింది. అదనంగా డబ్బులు వస్తాయని భావించారే తప్పా, దాని వెనుక మోసం ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు.


ఒకరూ ఇద్దరు కాదు 17,500 మంది ఆ కంపెనీ ట్రాప్‌లో పడిపోయారు. గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ జనవరిలో దాదాపు 2.74 కోట్లను పెట్టుబడి పెట్టాడు. క్రమక్రమంగా తాము మోస పోయామన్న విషయం ఆ డాక్టర్ బాబు అర్థమైంది.

ALSO READ: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

చివరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారాయన. పోలీసు కమిషనర్ స్పెషల్‌గా టీమ్‌ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఆయా కంపెనీల ఎండీ సయ్యద్ అష్ఫఖ్ రాహిల్, అతడి భార్య డైరెక్టర్ సయిదా అయేషాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 229 కోట్ల రూపాయల మేరా మోసగించినట్టు సమాచారం.

డీకెజెడ్ ఆఫీసులు, నిందితుల ఇళ్లు, ఫామ్ హౌస్‌లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. దాదాపు 500 పైచిలుకు అగ్రిమెంట్లు, ఏజెంట్లు, కస్టమర్లు పేర్లున్న దస్త్రాలు, బ్యాంక్ చెక్‌బుక్‌లు, 13 ల్యాప్ టాప్‌లు, కోటిన్నర క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ ఏజెంట్లు, ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×