BigTV English

OTT Movie : ప్రియుడి కోసం ప్రియురాలు సాహస పోరాటం…. ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : ప్రియుడి కోసం ప్రియురాలు సాహస పోరాటం…. ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : డిజిటల్ మీడియా ఈరోజుల్లో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ ని ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు నేటిజన్స్. ఇందులో థియేటర్లలో వచ్చిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. తమకు నచ్చిన సినిమాలను మూవీ లవర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నారు. అయితే వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఒక క్రేజీ సస్పెన్స్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కొలోనియా‘ (colonia). ఈ మూవీలో హీరో, హీరోయిన్ చిలి దేశంలోని ఒక ప్రాంతంలో ఇరుక్కుపోతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడటంతో మూవీ స్టోరీ కదులుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

డేనియల్ చిలి దేశంలోకి 1972వ సంవత్సరంలో వలస వస్తాడు. అయితే ఆ దేశంలో అప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. డేనియల్ కూడా తిరుగుబాటులో పాల్గొంటాడు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో పోరాడుతూ ఉంటాడు. ఈ దేశంలో లీనా అనే అమ్మాయి ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ ఉంటుంది. ఈమె డేనియల్ గర్ల్ ఫ్రెండ్. ఆమె కోసమే ఈ చిలి దేశానికి డానియల్ వచ్చి ఉంటాడు. ప్రభుత్వం చేసే అరాచకాలను వీడియో తీసిన డేనియల్ ను, పోలీసుల అరెస్టు చేస్తారు. కొలోనియాలోని ఒక రహస్య ప్రాంతానికి డానియల్ ని పంపిస్తారు. ఇక్కడ ఖైదీలను టార్చర్ చేస్తూ ఉంటారు. పాల్  అనే వ్యక్తి కొలోనియా ప్రాంతాన్ని శాసిస్తూ ఉంటాడు. మత ప్రబోధనలు చేస్తూ, మంచివాడిగా నటిస్తూ ఉంటాడు. అయితే అతడు చాలా క్రూరమైన మైన పనులు చేస్తుంటాడు. చిన్నపిల్లల్ని కూడా వదలకుండా అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు. వయసులో ఉన్న అందమైన అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు.

ఇతని అరాచకాలను ప్రభుత్వం కూడా చూసి ఏమీ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇతని అవసరం చాలా ఉంటుంది. మరోవైపు డేనియల్ ని కాపాడటానికి అతని ప్రియురాలు లీన  అక్కడికి వస్తుంది. డేనియల్ ఎక్కడున్నాడో గుర్తించి, అతనిని రహస్య మార్గం ద్వారా బయటకు తీసుకువస్తుంది. పాల్ చేసే ఆరాచకాలను వీడియొలతో సహ డేనియల్ దగ్గర ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న పాల్ మనుషులు వీరిని వెంబడిస్తూ ఉంటారు. చివరికి ఆ ప్రాంతం నుంచి వీళ్ళిద్దరూ బయటపడతారా? పాల్ అరాచకాలకు ముగింపు వస్తుందా? ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రింగ్ అవుతున్న ఈ ‘కొలోనియా’ (colonia) అనే హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×