BigTV English

Bigg Boss 8 Telugu: ‘మా’ పరివారంతో బీబీ పరివారం పోటీ.. ప్రైజ్ మనీ మరింత పెరిగింది..

Bigg Boss 8 Telugu: ‘మా’ పరివారంతో బీబీ పరివారం పోటీ.. ప్రైజ్ మనీ మరింత పెరిగింది..

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్‌గా నిలిచే వారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుందనే విషయాన్ని ముందుగా చెప్పలేదు. ఈ సీజన్‌లో ప్రైజ్ మనీ జీరో అని, కంటెస్టెంట్స్ అంతా టాస్కులు ఆడి ఆ ప్రైజ్ మనీని పెంచుకోవాలని బిగ్ బాస్ వివరించారు. అలా అందరూ టాస్కులు ఆడి గెలవడం వల్ల ఇప్పటివరకు ప్రైజ్ మనీ రూ.54,30,000కు చేరుకుంది. అయితే ఈ ప్రైజ్ మనీ ఇంతే అని ఫిక్స్ అయిపోకూడదని, ఇంకా ఫినాలేకు ఒకవారం ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చని తాజాగా ప్రసారమయిన వీకెండ్ ఎపిసోడ్‌లో తెలిపారు నాగార్జున. ఆయన చెప్పినట్టుగానే కంటెస్టెంట్స్‌కు ప్రైజ్ మనీ పెంచుకునే ఛాన్స్ లభించింది. వారితో ఆటలు ఆడడానికి మా పరివారం రంగంలోకి దిగింది.


ఆర్టిస్టులతో పోటీ

స్టార్ మాలో సీరియల్స్‌లో నటించే ఆర్టిస్టులు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారితో ఆటలు ఆడి ప్రైజ్ మనీని పెంచుకోమని కంటెస్టెంట్స్‌ను ఆదేశించారు బిగ్ బాస్. అలా ‘మా’ పరివారం వర్సెస్ బీబీ పరివారం ఆటలు మొదలయ్యాయి. ముందుగా హౌస్‌లోకి ‘నువ్వుంటే నా జతగా’ హీరో, హీరోయిన్ ఎంటర్ అయ్యారు. ఈ సీరియల్‌లో హీరోగా నటించిన అర్జున్ కళ్యాణ్.. మునుపటి బిగ్ బాస్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అలరించాడు. వారు హౌస్‌లోకి రాగానే తమ సీరియల్ గురించి అందరికీ వివరించారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో ప్రైజ్ మనీ పోటీలో పాల్గొనడానికి సిద్ధమాయ్యరు. వారితో పోటీ పడి కంటెస్టెంట్స్ గెలిస్తే.. ప్రైజ్ మనీకి రూ. 12,489 యాడ్ అవుతుందని బిగ్ బాస్ తెలిపారు.


Also Read: బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

బీబీ పరివారం గెలుపు

అర్జున్ కళ్యాణ్, అను కలిసి తమతో పోటీ పడడానికి ప్రేరణ, నబీల్‌ను ఎంచుకున్నారు. ఇందులో అమ్మాయిలో డ్రమ్‌లో పడుకొని ఉంటే అబ్బాయిలు తమను తోసుకుంటూ తీసుకెళ్లి అవతల వైపు ఉన్న బొమ్మలను తీసుకొని రావాలి. ఈ ఆటలో నలుగురు కష్టపడ్డారు. కానీ చివరికి బీబీ పరివారానికే విజయం దక్కింది. వారి ప్రైజ్ మనీలోకి రూ.12,489 యాడ్ అయ్యింది. వారు వెళ్లిపోయిన తర్వాత ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఫేమ్ ప్రభాకర్, ఆమని బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. వీరు కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ అయితే తాను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అవుతారని నిరూపించారు.

ప్రభాకర్ స్ట్రాటజీ

ప్రభాకర్, ఆమని కాసేపు కంటెస్టెంట్స్‌తో కబుర్లు చెప్పిన తర్వాత వారితో టాస్క్ ఆడడానికి సిద్ధపడ్డారు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ గెలిస్తే వారి ప్రైజ్ మనీలోకి రూ. 15,113 యాడ్ అవుతుంది. వారితో పోటీపడడం కోసం ప్రేరణ, అవినాష్‌లను ఎంచుకున్నారు. నలుగురు.. నేలపై ఉన్న బాల్స్, బెలూన్స్‌ను చేతితో పట్టుకోకుండా వారి వెనుక తగిలించుకున్న బుట్టలో వేసుకోవాలి. ఈ ఆటలో ప్రేరణ, అవినాష్ బాగా ఆడుతున్నారని తెలిసిన ప్రభాకర్.. వారి బుట్టలో నుండి బాల్స్ పడేయాలనుకొని తనే ఓడిపోయాడు. మొత్తానికి ఈ టాస్క్‌లో కూడా బీబీ పరివారమే గెలిచి తమ ప్రైజ్ మనీని మరింత పెంచుకున్నారు. అలా బిగ్ బాస్ 8 విన్నర్ ప్రైజ్ మనీ మరింత పెరుగుతూనే ఉంది.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×