EPAPER

OTT Movie : సినిమాలో ఛాన్స్ ఇస్తానని తీసుకెళ్లి ఇంత అరాచకమా? బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సినిమాలో ఛాన్స్ ఇస్తానని తీసుకెళ్లి ఇంత అరాచకమా? బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :  ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోయిన్ గా నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. పైగా ఆ హీరోయిన్ రానాతో కలిసి ఒక సినిమా చేయడం విశేషం. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం ఈ ఓటీటీలో అందుబాటులో ఉంది? సినిమా పేరేంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


రెండు నెలల తర్వాత ఓటిటిలోకి.. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రైం థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. దీనికి సంజన అన్నే దర్శకత్వం వహించడమే కాదు హీరోయిన్ గా కూడా నటించింది. అలాగే భరత్, జబర్దస్త్ అభి, సిరీ చౌదరి కీలక పాత్రలో కనిపించారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది జూలైలో రిలీజ్ అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంజన అనూహ్యంగా ఫస్ట్ వీక్ లోనే షో నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటించగా, ఈ మూవీ తోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘నీకు నాకు పెళ్ళంట’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే రానా, తేజ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాలో ఓ కీలక పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు ఐదారేళ్ల గ్యాప్ తీసుకుని క్రైమ్ రీల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొత్తం సోషల్ మీడియా మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకునే యూత్ గురించి ఉంటుంది. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కెయ్యండి.


కథలోకి వెళ్తే…

కొంతమందికి సినిమాలు, వెండి తెరపై మెరవలన్న పిచ్చి ఎక్కువగా ఉంటుంది. అలా సినిమాలంటే పిచ్చితో హీరోయిన్ కావాలని కలలు కంటుంది మౌనిక అనే అమ్మాయి. ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు బావ అంజి. ఈ నేపథ్యంలోనే జానీ అని అబ్బాయి మౌనికకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్తాడు. అయితే ఊహించని విధంగా ఆ అమ్మాయి డెడ్ బాడిని పోలీసులు కనుగొంటారు. ఆ కేసు బాధ్యత పోలీసు ఆఫీసర్ అయిన మాయా తీసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ హత్య మనకున్న మిస్టరీని ఛేదించడానికి ట్రై చేస్తుంది. మరి ఆ అమ్మాయిని హత్య చేసింది ఎవరు? ఈ హత్యకు కారణం ఏంటి? ఈ లేడి పోలీస్ ఆఫీసర్ నిందితుడిని పట్టుకోగలిగిందా? అని అంశాల ఆధారంగా ఈ క్రైమ్ రీల్ మూవీ సాగుతుంది.

Related News

Devara OTT : “దేవర” ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 12 తెలుగు మూవీస్.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి.. 

OTT Movie : చెల్లి భర్తను అక్క లాగేసుకోవాలి అనుకుంటే… క్రేజీ క్రైం థ్రిల్లర్

OTT Movies : 30 ఏళ్లుగా ఓ శాపం.. ఆ ప్రాంతంలో దాగున్నా ఎన్నో మిస్టరీలు.. వరుస షాకులు..

OTT Movie : ఒంటరిగా కనిపించే అమ్మాయి ఆ సైకో టార్గెట్… సైకో కిల్లర్ మూవీ

OTT Movie : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అత్తామామలను చంపే కోడలు… బుర్ర తిరిగిపోయే మలయాళ మూవీ

OTT Movie : పిల్ల కోసం తల్లిని పెళ్లాడే ఘనుడు… యూత్ ఫుల్ ఎంటర్టైనర్

Big Stories

×