Toothache: పంటి నొప్పి తరచుగా వస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దంతక్షయం, చిగుళ్ల సమస్యలు లేదా ఏదైనా రకమైన దంతాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దంతాలు, చిగుళ్లను ఇవి బలోపేతం చేస్తాయి.
లవంగం నూనె:
కాటన్ ముక్క తీసుకుని దానిపై లవంగం నూనె రాయండి. తర్వాత దానిని నొప్పి ఉన్న ప్రదేశంలో తేలికగా రుద్దండి. లవంగం నూనె అందుబాటులో లేకపోతే, మీరు లవంగాలు నమలడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. లవంగం నూనె పంటి నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దంతాలను బలంగా చేస్తుంది.
ఉప్పు నీరు పుక్కిలించడం:
ఉప్పునీరు పుక్కిలించడం అనేది సమర్థవంతమైన, సరళమైన నివారణ. ఇది ఇన్ఫెక్షన్ , వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా నోటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది. ఇలా తరుచుగా చేయడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం అందుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి. ఈ మిశ్రమంతో రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. ఈ నీరు చాలా వేడిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
Also Read: చందమామ లాంటి ముఖం కోసం.. దీన్ని ఒక్క సారి వాడండి
పసుపు :
పసుపులో యాంటిసెప్టిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. కొద్దిగా నీరు లేదా కొబ్బరి నూనె తీసుకుని చిటికెడు పసుపు అందులో వేసి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి.
పంటి నొప్పి నుండి ఉపశమనం పొందడంలో ఈ హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్లను సంప్రదించడం చాలా ముఖ్యం.
ఐస్:
ఐస్ పంటి నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది. ఇది పంటి నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. నొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.
ఒక చిన్న ఐస్ ముక్కను ఒక క్లాత్ లో చుట్టి, నొప్పి ఉన్న దగ్గర 10-15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి. ఐస్‌ను నేరుగా పంటిపై ఉంచొద్దు. ఇలా చేస్తే.. నొప్పి మరింత పెరుగుతుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపడానికి , పంటి నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఒక వెల్లుల్లి రెబ్బను గ్రైండ్ లేదా ముక్కల లాగా చేసి నొప్పి ఉన్న పంటిపై ఉంచండి. కావాలంటే వెల్లుల్లిలో కొద్దిగా ఉప్పు కలిపి నొప్పి ఉన్న చోట రాసుకోవచ్చు. ఇలా చేస్తే తొందరగానే నొప్పి తగ్గిపోతుంది.
Also Read: పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఇది వాడితే తెల్లగా మెరిసిపోతారు
మందార ఆకులు:
మందార ఆకులు పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడే మరొక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది వాపు , నొప్పిని తగ్గిస్తుంది.
కొన్ని మందార ఆకులను కడిగి శుభ్రం చేసి నమలండి. మందార ఆకులను పేస్ట్ చేసి దంతాల మీద కూడా రాసుకోవచ్చు. రోజుకు 2 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా మందార ఆకులు నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.