E-Paper
Advertisement

OTT Movie : పావురం తలకు పూజలు చేసే సైకో పిల్ల… చిన్న పిల్లలతో చూడకూడని హార్రర్ మూవీ

OTT Movie : పావురం తలకు పూజలు చేసే సైకో పిల్ల… చిన్న పిల్లలతో చూడకూడని హార్రర్ మూవీ
Advertisement

OTT Movie : హారర్ సినిమాలకు ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే ఇతర జానర్ల సినిమాలకు లేదు అనేది వాస్తవం. ఈ జానర్ లో సినిమా వస్తుంది అంటే చాలు భయపడే వాళ్ళు కూడా అవసరమైతే దుప్పటి కప్పుకుని మరీ సినిమాను చూడడానికి ఇష్టపడతారు.  ఎంగేజింగ్ గా ఉండే ఈ సినిమాలంటే ఎంతో మందికి పిచ్చి ఉంటుంది. ఇక కొన్ని హారర్ మూవీస్ అయితే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అలాంటి ఒక భయంకరమైన హారర్ మూవీ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

హారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ మేకర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు గ్రిప్పింగ్ స్టోరీ తో హారర్ సినిమాను తెరకెక్కించే తీరు ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా అలాంటిదే. ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ పీపుల్ లేదా హార్ట్ వీక్ గా ఉన్న వాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉంటే మంచిది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మరి మీరు అసలు ఈ మూవీని ఇప్పటిదాకా చూశారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

స్టోరీ లోకి వెళ్తే

Advertisement

ఒక ముసలావిడ కూతురు ఫ్యామిలీ చుట్టూ సినిమా స్టోరీ నడుస్తుంది. ఇందులో హీరోయిన్ తన ఫ్యామిలీతో కలిసి తల్లికి దూరంగా ఉంటుంది. అయితే ఆమెకి సైకలాజికల్ గా సమస్యల ఉన్న కూతురు ఉంటుంది. అలాగే ఒక టీనేజ్ కొడుకు కూడా ఉంటాడు. ఒకానొక టైంలో తల్లి చనిపోయింది అనే వార్త అందడంతో ఆమె అంతిమ సంస్కారాలకు తన భర్త పిల్లలతో కలిసి వెళుతుంది హీరోయిన్. కొన్ని రోజులయ్యాక సడన్ గా తల్లి ఆత్మ తనను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది హీరోయిన్ కి. ఇక మరోవైపు ఈ సైకిక్ పిల్ల ఏకంగా పావురం తలను తీసుకొచ్చి దానికి పూజలు చేస్తూ తల్లిని మరింత భయపెడుతుంది. ఓ రోజు హీరోయిన్ కొడుకు తన ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళ్తాడు. అలాగే తనతో కూడా చెల్లెలు కూడా తీసుకెళ్తాడు. అయితే పార్టీలో కాసేపటికి సడన్ గా విచిత్రంగా అనిపించడంతో పీటర్ తన చెల్లిని తీసుకొని బయటకొస్తాడు. అక్కడి నుంచి స్పీడ్ గా ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు.  ఈ క్రమంలో ఒక అనుకోని యాక్సిడెంట్ జరిగి తన చెల్లెలి తల చూస్తుండగానే తెగి పడుతుంది. ఆ షాక్ లో ఉన్న అబ్బాయి పాప మొండేన్ని మాత్రం అలాగే కారులో పెట్టుకుని ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంలో పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇవన్నీ చక్కదిద్దడానికి హీరోయిన్ ఏం చేసింది? అసలు ఆ ఫ్యామిలీకి ఎందుకిలా జరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే ‘హెరిడేటరీ’ అనే ఈ సినిమాపై ఒక లుక్కెయ్యండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×