BigTV English

Hyderabad City Development: భాగ్యనగరానికి మహర్దశ – 6 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారంటే..

Hyderabad City Development: భాగ్యనగరానికి మహర్దశ – 6 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారంటే..

Hyderabad city development:


హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ పనులకు శ్రీకారం

❂ అభివృద్ధితోనే ప్రభుత్వ సమాధానం
❂ చార్మినార్ టు ఆర్ఆర్ఆర్
❂ నలువైపుల నుంచి రోడ్ల కనెక్షన్
❂ నగరంలో జక్షన్ల అభివృద్ధి
❂ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు
❂ ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ లింక్ రోడ్లు


❂ ఓవైపు మూసీ ప్రక్షాళన
❂ ఇంకోవైపు ఆర్ఆర్ఆర్ పనులు
❂ కొత్తగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు
❂ రూ.826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణం
❂ మొదటి ప్యాకేజీలో 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్‌లు
❂ రెండో విడుతలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్‌లు
❂ హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్ల బడ్జెట్
❂ ఎటు నుంచైనా ఈజీగా నగరానికి వచ్చేలా ప్లాన్
❂ హైవేలతో విశాలమైన లింక్ రోడ్ల కనెక్షన్
❂ అభివృద్ధే తమ లక్ష్యమంటున్న రేవంత్ సర్కార్

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈనెల 7కు పది నెలలు పూర్తవుతుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి, ఇంత తక్కువ సమయంలో పాలనపై పట్టు సాధించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అంత ఆషామాషీ కాదు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే, ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేసింది.

నగరంలో కీలక ప్రాజెక్టులు

హైదరాబాద్ అభివృద్ధి కోసోం బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లను విస్తరిస్తోంది. అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.826 కోట్ల వ్యయంతో 6 జంక్షన్లను డెవలప్ చేసేందుకు ప్లాన్ గీసింది. రెండు ప్యాకేజీలుగా వీటిని అభివృద్ధి చేస్తోంది. మొదటగా రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్‌పాస్‌లు నిర్మించనుంది. ఇక రెండో విడుతగా నాలుగు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్‌ల నిర్మాణం ఉంటుంది. వీటి నిర్మాణంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర రూపురేఖలు మారిపోనున్నాయి. ఇక, ప్రతిష్టాత్మక మూసీ ప్రక్షాళన కూడా చేపట్టింది ప్రభుత్వం. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. చాలామంది స్వచ్ఛందంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. వీటితోపాటు ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను చేపడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఇవన్నీ పూర్తయితే, హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి.

ఆర్ఆర్ఆర్‌తో తెలంగాణ బ్రాండ్

ఇప్పటికే ఓఆర్ఆర్ దాకా నగరం విస్తరించింది. చాలా ఏరియాల్లో ఓఆర్ఆర్ కూడా దిటి పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ కీలకంగా మారింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, కేంద్ర పెద్దలతో తరచూ చర్చలు జరుపుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో తెలంగాణ అంతటా రోడ్ల కనెక్టివిటీ చాలా ఈజీ అవుతుంది. ప్రయాణ సమయం తగ్గిపోతుంది. రాజధాని హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్లడం పెద్దగా కష్టంగా అనిపించదు. దీనివల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పనుల్లో వేగం పెంచింది ప్రభుత్వం.

– దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×