BigTV English

OTT Movie : మరో అమ్మాయితో భర్త… ఈ భార్య చేసే పనికి బుర్ర గిర్రున తిరగాల్సిందే

OTT Movie : మరో అమ్మాయితో భర్త… ఈ భార్య చేసే పనికి బుర్ర గిర్రున తిరగాల్సిందే

OTT Movie : డిజిటల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిందో, మానవ సంబంధాలు అంతగా దిగజారిపోతున్నాయి. భార్యాభర్తల అక్రమ సంబంధాల గురించి ఎన్నో సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే  మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ పేరు “లవింగ్ అడల్ట్స్” (Loving Adults). ఈ మూవీలో భర్త అక్రమ సంబంధాన్ని భార్య తెలివిగా, ఎలా అంతం చేయాలనుకొందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

క్రిస్టియన్ ఒక కంపెనీ స్థాపించి తన భార్య, కొడుకుతో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతనికి తన భార్య అంటే ఇష్టం ఉండదు. క్రిస్టియన్ వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఒకరోజు క్రిస్టియన్ కి పదే పదే కాల్స్ వస్తూ ఉండటంతో, క్రిస్టియన్ భార్య కి అనుమానం వస్తుంది. ఈ విషయం మీద భర్తతో గొడవ పడుతుంది. భర్తను సీక్రెట్ గా ఫాలో అవుతూ తన ఆఫీస్ కి వెళ్తుంది. ఆఫీసులో క్రిస్టియన్ ఒక అమ్మాయితో ఏకాంతంగా గడపడం తన కళ్ళారా చూస్తుంది. ఈ విషయం పై భర్తను నిలదీస్తుంది. నువ్వంటే నాకిష్టం లేదు నాకు విడాకులు కావాలని భార్యను క్రిస్టియన్ అడుగుతాడు. ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండటం తో ఆమె అందుకు ఒప్పుకోదు. ఈ క్రమంలో క్రిస్టియన్ తో అతని లవర్ మాట్లాడుతూ, నీ భార్యని చంపేస్తే మనకు ఎవరూ అడ్డు ఉండరని ఒత్తిడి చేస్తుంది. భార్యను చంపాలని క్రిస్టియన్ ఒక నిర్ణయానికి వస్తాడు. కారులో వెళ్తూ జాగింగ్ చేస్తున్న తన భార్యని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు.

ఇంటికి వచ్చిన క్రిస్టియన్ తాను చేసిన తప్పుకు బాధపడుతూ ఉంటాడు. కాసేపటికి భార్య తిరగి ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది ఏమంటే భార్య అనుకొని వేరొకరిని కారుతో గుద్దేశి ఉంటాడు క్రిస్టియన్. తను చేసిన తప్పుకి మళ్ళీ గిల్టీ ఫీల్ అవుతాడు. తన భర్త నన్ను చంపడానికి వేసిన ప్లాన్ లో భాగంగా, పొరపాటున వేరొకరిని ఆక్సిడెంట్ చేశాడని భార్య గుర్తిస్తుంది. ఈ విషయం పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే, నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేయాలని భర్తకి చెబుతూ కండిషన్ పెడుతుంది. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత పోలీసులకు తన భార్య  చెప్తుందేమోనని భయపడి ఆ డీల్ కి ఒప్పుకుంటాడు. చివరికి క్రిస్టియన్ తన లవర్ ని మార్డర్ చేస్తాడా? పోలీసులు క్రిస్టియన్ ని పట్టుకుంటారా? క్రిస్టియన్ భార్య చివరికి భర్తని ఇరికిస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “లవింగ్ అడల్ట్స్” (Loving Adults) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×