Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపడానికి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లు మొదలయ్యాయి. గతవారం దీనికి సంబంధించిన టాస్కులను ఆడి ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రాకుండా ఆపగలిగారు హౌస్‌మేట్స్. దీంతో ఇక ఈ టాస్కులు పూర్తయ్యాయని వారు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇంకా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కొనసాగుతుందని, అంతే కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ గెలిచిన ప్రతీసారి ప్రైజ్ మనీలోకి రూ.1,50,000 యాడ్ అవుతుందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఈ పోటీల కోసం సిద్ధపడ్డారు. కానీ సీత తీసుకున్న నిర్ణయాల వల్ల తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు అయిపోయింది.
నబీల్ ఓటమి
తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో రెండు టాస్కులు జరిగాయి. అందులో మొదటి టాస్కులో ఇరు టీమ్స్ ఓడిపోయాయి. రెండో టాస్క్‌లో నిఖిల్ టీమ్ గెలిచింది. దీంతో సీత టీమ్ నుండి ఒకరు ఆట నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీత టీమ్ అంతా కలిసికట్టుగా మణికంఠను గేమ్ నుండి తప్పించారు. అలా మూడో టాస్క్ మొదలయ్యింది. ఇది బలంతో పనిచేయాల్సిన టాస్క్ కాకపోయినా నబీల్‌ను మరోసారి ఆయుధంగా వాడుకుంది సీత. మరోసారి టాస్క్ ఆడే అవకాశం తనకే ఇచ్చింది. ఇక నిఖిల్ టీమ్ నుండి ఈ టాస్క్ ఆడడానికి ఆదిత్య ఓం వచ్చి తనే విన్నర్ అయ్యాడు. దీంతో సీత టీమ్‌పై దెబ్బపడింది.
Also Read: మరోసారి మణికంఠకు అన్యాయం.. ఎక్కడ ఉన్నా తనకు ఈ కష్టాలు తప్పవా?
చీఫ్ నిర్ణయాలు తప్పు
మూడో టాస్క్ కూడా ఓడిపోవడంతో సీత టీమ్ నుండి ఒకరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుండి తప్పుకోవాలని, ఆ తప్పుకోవాల్సింది ఎవరు అని నిఖిల్ టీమ్ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో నిఖిల్ టీమ్ మధ్య డిస్కషన్ మొదలయ్యింది. ఇప్పటివరకు నైనికా, ప్రేరణ, సీత.. ఈ ముగ్గురు ఒక్క టాస్క్‌లో కూడా ఆడలేదు. కాబట్టి ఈ ముగ్గురిలో నుండి ఒకరిని తీసేయాలని నిఖిల్ టీమ్ అనుకుంది. కానీ నిఖిల్‌కు మాత్రం సీతను తీసేయాలని అనిపించింది. అందుకే తన పేరే చెప్పాడు. ఆడే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా తను ఆడకుండా, వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మళ్లీ మళ్లీ నబీల్‌నే పంపించిందని అందుకే తనకు చీఫ్‌గా నిర్ణయాలు తీసుకోవడం లేదనే కారణం చెప్తూ తనను ఈ ఛాలెంజ్ నుండి తొలగించాడు.
ప్రేరణపై ప్రేమ
తనను తొలగించడంతో సీత బాగా ఫీల్ అయ్యి ఏడ్చింది కూడా. ప్రేరణను తొలగించే ఛాన్స్ ఉన్నా కూడా యష్మీ వల్లే ప్రేరణను తీసేయలేదని సీత అనుకుంది. కానీ మళ్లీ మళ్లీ నబీల్‌నే ఆయుధంగా వాడుకోవడం నిఖిల్ టీమ్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అందుకే అస్సలు గేమ్‌లో తన సత్తా చూపించని సీతపై వేటుపడింది. మూడో టాస్క్‌లో నబీల్ రాకుండా ఉండాల్సింది అని, తను బక్వాస్ ఆట ఆడాడని యష్మీ వ్యాఖ్యలు చేసింది. కానీ నబీల్ మాత్రం తనకు నచ్చే ప్రతీ ఆటలో ఆడడానికి ముందుకొస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి సీత తీసుకున్న నిర్ణయం చివరికి తనే గేమ్‌లో లేకుండా చేసింది.