BigTV English

Bigg Boss 8 Telugu: హరితేజను కాపాడిన గౌతమ్.. రోహిణిని బాడీ షేమింగ్ చేసిన గౌతమ్

Bigg Boss 8 Telugu: హరితేజను కాపాడిన గౌతమ్.. రోహిణిని బాడీ షేమింగ్ చేసిన గౌతమ్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నుండి మణికంఠ స్వయంగా తప్పుకున్నాడు. తనను నమ్మి ప్రేక్షకులు ఓట్లు వేసినా కూడా ఇక ఈ రియాలిటీ షో అనేది తన వల్ల కాదనే ఉద్దేశ్యంతో బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో మణి వెళ్లిన తర్వాత మరో నామినేషన్స్‌కు సమయం వచ్చేసింది. అయితే గౌతమ్ మెగా చీఫ్ కావడంతో ఈవారం నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. తనను రకరకాల పాయింట్స్‌పై నామినేట్ చేయాలని చాలామంది కంటెస్టెంట్స్‌కు ఉన్నా కూడా మెగా చీఫ్ అవ్వడం వల్ల ఈవారం తను సేఫ్. ఇక మెగా చీఫ్ దగ్గర ఉన్న నామినేషన్ షీల్డ్‌ను ఎవరికి ఇస్తావని బిగ్ బాస్ అడగగా తను హరితేజ పేరు చెప్పాడు.


నిఖిల్ జీరో

విష్ణుప్రియాతో ఈవారం నామినేషన్స్ మొదలయ్యాయి. తను ముందుగా ప్రేరణను నామినేట్ చేస్తూ గతవారం జరిగిన నామినేషన్స్‌లో ప్రేరణ చెప్పిన పాయింట్ తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అదే కారణంపై ప్రేరణను నామినేట్ చేయాలని చాలామంది ఇతర హౌస్‌మేట్స్ కూడా అప్పటికే ఫిక్స్ అయ్యి ఉన్నారని అర్థమవుతోంది. అలాగే ప్రేరణ కూడా ఇదే విషయంలో అందరినీ ఎదిరించడానికి రెడీగా ఉందని కూడా తెలుస్తోంది. ప్రేరణ తర్వాత నిఖిల్‌ను నామినేట్ చేసింది విష్ణుప్రియా. తన గేమ్ రోజురోజుకీ డౌన్ అయిపోతుంది అంటూ కారణం చెప్పింది. అయినా నిఖిల్ ఆ విషయం ఒప్పుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రోహిణి కూడా నిఖిల్‌నే నామినేట్ చేసింది.


Also Read: ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న గౌతమ్.. ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ పక్కా

ఏ పని చేయవు

గతవారం జరిగిన టాస్క్‌లో గౌతమ్‌తో గొడవ పడడాన్ని గుర్తుచేసి, నిఖిల్ అలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది రోహిణి. తర్వాత తను పృథ్విని నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. అసలు పృథ్వి ఫిజికల్ టాస్కులు ఆడడం తప్పా మరేమీ చేయడని చెప్పుకొచ్చింది. అసలు విష్ణుప్రియా లేకపోతే తను కెమెరాలకు కూడా కనపడడు అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దానికి పృథ్వి ఒప్పుకోలేదు. ఆ తర్వాత పృథ్వి టర్న్ వచ్చింది. ముందుగా ప్రేరణను గతవారం నామినేషన్స్ కారణం చెప్పి, ఆపై రోహిణిపై రివెంజ్ నామినేషన్ వేశాడు. మీరేం టాస్కులు ఆడలేదు అని కారణం చెప్పాడు. దానికి రోహిణి ఒప్పుకోలేదు. ‘‘నువ్వు అసలు ఏమీ చేయవు. నువ్వు తాగిన కప్పు కూడా కడగవు. వేరే కంటెస్టెంట్‌కు ఇస్తావు ఆమె కడిగేస్తుంది’’ అని చెప్పగానే విష్ణుప్రియా సీరియస్ అయ్యింది.

బాడీ షేమింగ్

నేను 11వ వారం వరకు వచ్చాను అని పృథ్వి అనగానే వేరే కంటెస్టెంట్స్ వల్ల వచ్చావంటూ కౌంటర్ ఇచ్చింది రోహిణి. అలా వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు పృథ్వి ఒక లుక్ ఇచ్చాడు. అది రోహిణికి బాడీ షేమింగ్ లాగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన నయని పావని.. గతవారం జరిగిన టాస్క్‌ను దృష్టిలో పెట్టుకొని మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. ఆపై హరితేజ వచ్చి కూడా అదే పాయింట్‌తో మెహబూబ్‌ను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. నబీల్.. ప్రేరణ, హరితేజను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. మొత్తానికి ఈవారం జరిగిన నామినేషన్స్‌లో ప్రేరణ, తన మొండితనమే హైలెట్ అయ్యింది. అంతే కాకుండా పృథ్వి.. విష్ణుప్రియా వల్లే హైలెట్ అవుతున్నాడనే పాయింట్‌ను ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ చెప్పలేకపోయారు కానీ రోహిణి చెప్పిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×