Pushpa2 Event : పుష్ప రాజ్ మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో థియేటర్లలో దిగబోతుంది. ఈ సందర్బంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్ తాజాగా హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పుష్ప 2 పై అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్ హైలెట్ అయ్యింది. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో కూడా తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఈ ఈవెంట్ లో కుబా అనే పేరు ఎక్కువగా వినిపించింది. అసలు ఎవరు ఈ కుబా? ఆయన ఎన్ని తెలుగు సినిమాలు చేసారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మిరోస్లా కూబా బ్రొజెక్.. ఈయన ఒక సినిమాటో గ్రాఫర్.. పుష్ప సినిమాకు, ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా పనిచేశారు. ఒక పోలిష్ సినిమాటోగ్రాఫర్, అతను ప్రధానంగా పోలిష్ మరియు భారతీయ తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తాడు.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత విక్రమ్ కుమార్ పోలాండ్‌లో తన సినిమా షూటింగ్ టైం లో ఈ కుబాను చూశారు. ఆయన నిర్మించిన ఒక సినిమాకు కుబా సినిమాటో గ్రాఫర్ గా చేశారు. అతని ప్రతిభకు ముగ్ధుడైన విక్రమ్ నిర్మాత్తగా వ్యవహరించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు పని చేశారు. ఆ తర్వాత సుకుమార్ కోరిక మేరకు పుష్ప: ది రైజ్ మూవీకి పనిచేసారు. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2: ది రూల్ కు కూడా పని చేశారు. అంటే ఈ సినిమాటో గ్రాఫర్ తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలను చేశారు. ఈ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
పుష్ప 2 విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కిస్సిక్ సాంగ్ చేసి సినిమా స్థాయిని మరింతగా పెంచింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరు అయ్యారు.. ఇక ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 4 సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌లతో సందడి మొదలు కాబోతుంది. మొదటి రోజు వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. రూ.300 కోట్ల గ్రాస్ మొదటి రోజే రాబట్టనుందనే అంచనాలు ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో… 1000 కోట్లకు పై వసూల్ చేస్తుందేమో చూడాలి..