OTT Movie : భూమి, దానిపై జీవం ఎలా పుట్టింది అన్న ప్రశ్నకు ఇప్పటికైతే సమాధానం దొరికింది. అయితే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాదనలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలామందికి ఇవి అనుమానాలు గానే మిగిలిపోయాయి. ఇదే ఒక వింత అనుకుంటే ఫ్యూచర్ కొంతవరకు భయంకరంగా, మరికొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ స్టాపబుల్ క్యూరియస్ గా అనిపిస్తుంది. అందుకే ఇలా ఫ్యూచర్ ని బేస్ చేసుకుని తెరకెక్కే సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చాలామంది మూవీ లవర్స్ చెవి కోసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది. ఫ్యూచర్ అనేసరికి ముందుగా గుర్తొచ్చేది ఏలియన్స్. ఒకవేళ నిజంగానే ఏలియన్స్ ఉంటే మనకు వాటికి మధ్య ఫ్యూచర్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేది కొంతమంది వాదన. గ్రహాంతరవాసులు కూడా భూమిపై నివాసం ఏర్పరుచుకోవడానికి వచ్చి మనుషులకు నివాసం లేకుండా చేస్తారని అంటూ ఉంటారు. అచ్చం ఇలాంటి స్టోరీ తోనే రూపొందింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ.
స్టోరీలోకి వెళ్తే…
వేరే గ్రహం నుంచి కొంతమంది ఏలియన్స్ ని సొంత వాళ్ళే వెలివేస్తారు. దీంతో వాళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియక వెతుక్కుంటూ వెతుక్కుంటూ భూమ్మీదకి నివాసం ఏర్పరచుకోవడానికి వస్తారు. ఏలియన్స్ కి మనుషులకు మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. అయితే ఏలియన్స్ శక్తి ముందు మనుషుల శక్తి తక్కువే అన్న విషయం అర్థమవుతుంది. ఇక తప్పదు అనుకున్న సమయంలో చివరకు న్యూక్లియర్ బాంబ్స్ ను ఉపయోగించి యుద్దంలో గెలుస్తారు మనుషులు. కానీ ఈ న్యూక్లియర్ బాంబుల వల్ల ఆ తర్వాత రేడియేషన్ పెరిగిపోతుంది. అలాగే జీవులు బ్రతకడానికి పనికిరాని గ్రహంగా మారిపోతుంది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆ ఏలియన్స్ చంద్రుడిని కూడా నాశనం చేస్తాయి. చంద్రుడు లేకపోవడం వల్ల భూమిపై సునామీలు, భూకంపాలు రావడం లాంటివి జరుగుతాయి. దీంతో భూమిపై ఉన్న మనుషులంతా టైటాన్ మీదకు షిఫ్ట్ అవుతారు. కానీ అక్కడ పవర్ కావాలి కాబట్టి భూమి పైనుంచి సప్లై చేసుకునేలా ప్లాన్ చేస్తారు. కానీ యుద్ధంలో ఓడిపోయిన ఏలియన్స్ మనుషుల నిర్మించిన ఆ పవర్ గ్రిడ్స్ ని నాశనం చేస్తారు. అంతేకాకుండా అవి బాగు చేయడానికి టైటాన్ నుంచి భూమ్మీదకి వచ్చే ఇంజనీర్స్ ను చంపేస్తాయి. దీంతో అటు మనుషులు, ఇటు ఏలియన్స్ మధ్య ఎడతెగని యుద్ధం నడుస్తుంది. అయితే ఈ యుద్ధంలో చివరికి ఎవరు గెలిచారు? ఏలియన్స్ భూమిని వదిలి పెట్టాయా లేదా? చివరికి స్టోరీ కి ఎండ్ కార్డు ఎలా పడింది అనే విషయం తెలియాలంటే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓబ్లివియన్ అనే ఈ సినిమాను చూడాల్సిందే.